VZM: పాచిపెంట(M)అలూరు నుంచి కోడికాళ్లవలస వరకు 4.4 కి.మీ రహదారి భారీ గుంతలతో దర్శనమిస్తోంది. మడవలస, కేసలి కొటికి పెంట ప్రజలు ఏ చిన్న అవసరం ఉన్నా ఈ దారిలోనే నిత్యం పాచిపెంటకు రాకపోకలు సాగిస్తామని స్థానిక ప్రజలు తెలిపారు. రహదారి పొడవునా గుంతలు, పలుచోట్ల రోడ్డు కోతకు గురై దీనికి తోటు ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీటితో నిండిచెరువులను తలపిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.