GDWL: రాజోలి మండల కేంద్రంలో గురువారం కేవీపీఎస్ (కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి) సంఘం జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాజోలి కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ.. 1998 అక్టోబర్ 2న ఏర్పడిన కేవీపీఎస్ సంఘం అంటరానితనం, దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టేందుకు, సామాజిక, ఆర్థిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలనకై పోరాటం చేస్తుందన్నారు.