RR: గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు మూసివేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే షాద్ నగర్ లోని పలుచోట్ల మాంసం దుకాణాలు తెరిచే ఉన్నట్లు సమాచారం. విజయదశమి రోజున గిరాకీ ఉండటంతో మాంసం దుకాణాలు తెరిచి విక్రయాలు చేస్తున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.