GNTR: గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా బుధవారం జీ.జీ.హెచ్లో పలు సదుపాయాలను ప్రారంభించారు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా 15 పడకల వార్డును ఏర్పాటు చేసి ప్రారంభించగా, డెంటల్ విభాగంలో రూ.1.20 లక్షల వ్యయంతో రేడియో వీడియోగ్రాఫీ ఎక్స్‌రే యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు ఆసుపత్రి విభాగాలు, నర్సింగ్ పాఠశాల వసతి గృహం పరిశీలించారు.