వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో వెస్టిండీస్ 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 42 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీసి పర్యటక జట్టును కష్టాల్లోకి నెట్టగా, జస్ప్రీత్ బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం రోస్టన్ చేజ్, అలిక్ అథనాజ్ క్రీజులో ఉన్నారు.