VZM: ప్రభుత్వం వైద్య కళాశాలల పీపీపీ లీజు నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద రైతు కూలీ సంఘం, పీడీఎసీ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీని అనుమతులు లేకుండా నిర్వహించడం పట్ల రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, శ్రీనులతో పాటు మరికొందరు పైకేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.