KNR: జిల్లా కేంద్రంలోని మంకమ్మతోటకు చెందిన రిషికేష్ పుప్పాల, రక్షిత్, చంద్రసాయి, అనిరుద్ విద్యార్థులు చేసిన పనికి GREAT అనాల్సిందే. వివరాలకు వెళ్తే.. ఈ నలుగురు విద్యార్థులు మంకమ్మతోటలో వరుసగా రెండవసారి గణేష్ మండపాన్ని నిర్మించి, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల అనంతరం మిగిలిన నిధులతో వారు ఓ ఆర్ఫన్స్ ఫౌండేషన్‌కు బియ్యం ఇచ్చారు.