MLG: విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ చెడుపై మంచికి, అజ్ఞానంపై జ్ఞానానికి, అన్యాయంపై న్యాయానికి సంకేతంగా నిలుస్తుందని అన్నారు. ఈ పర్వదినం ప్రతి ఇంట్లో సుఖశాంతులు నింపి, ప్రజల జీవితాల్లో మరింత ఆనందం, అభివృద్ధి ఐక్యత ప్రసాదించాలన్నారు.