NLR: గాంధీ జయంతి (డ్రై-డే),దసరా రెండూ ఒకే రోజు రావడంతో గురువారం పొదలకూరు మాంస వ్యాపారులు ఈ రోజు డ్రై-డే అన్న సంగతే మర్చిపోయారు.. సాధారణంగా ప్రతి ఏడాది అక్టోబర్-2గాంధీ జయంతిని పురస్కరించుకొని మద్యం,జీవహింస నిషేదిస్తారు. ఆ దిశగా అధికారులు వ్యాపారులకు ముందస్తు సమాచారం అందిస్తారు కానీ ఈ దఫా అవేమి జరిగినట్లు లేదు. దీనితో యథేచ్ఛగా మాంసం విక్రయాలు చేస్తున్నారు.