E.G: గాంధీ జయంతి సందర్భంగా అనపర్తి రామవరం గ్రామాల్లోని గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం పూలమాలవేసి నివాళులర్పించారు. సత్యం, శాంతి, అహింస ఆయుధాలుగా చరిత్రలో చెరగని ముద్రవేసిన మహనీయుడు జాతిపిత గాంధీ అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.