ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 8న హైకోర్టు విచారణ ఉత్కంఠ రేపుతోంది. పలు పిటిషన్లపై విచారణ జరుగుతుండగా, ఎన్నికల షెడ్యూల్ కొనసాగుతుందా లేక వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు సమాధానం రాబోతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ అంశం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.