ఇథియోపియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సిదామా ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 71 మంది మరణించారు. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో కొందరు వివాహ వేడుకకి వెళ్లి తిరుగు పయనమైనట్లు చెప్పారు.