KDP: చాపాడు మండలం ఏటూరు రహదారిలో కేసీ కాలువలో మృతదేహం గురువారం లభ్యమైంది. మృతురాలు దువ్వూరు మండలం నీలాపురం గ్రామానికి చెందిన నారాయణమ్మ అనే వృద్ధురాలిగా గుర్తించారు. ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లగా, మతిస్థిమితం లేక నీళ్లలో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.