సత్యసాయి: తనకల్లు మండలం అగ్రహారంపల్లిలో పనికి వచ్చిన కూలీలు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. కొక్కంటి సమీపంలో ఆటో బోల్తా పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. మృతులు కడప జిల్లా చక్రాయపేట మండలంలోని కొండప్పగారిపల్లి, ఆంజనేయపురం, బురుజుపల్లి గ్రామాలకు చెందినవారని స్థానికులు తెలిపారు.