KNR: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో రాత్రి ఓ కారు బోల్తా పడింది. రోడ్డుపక్కనే ఉన్న పత్తిపాక మొగిలి పొలం వద్ద కారు రివర్స్‌లో పడి ఉంది. ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు కారు అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మద్యం మత్తులో ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.