HNK: శాయంపేట మండలం మాందారిపేట గ్రామానికి చెందిన రేణిగుంట్ల ఐలయ్య అనారోగ్యంతో చికిత్స పొంది ఇంట్లో కోలుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ జడ్పీ ఛైర్పర్సన్, BRS జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గురువారం ఐలయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో BRS మండల నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.