E.G: నల్లజర్ల మండలంలోని పోతవరం గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని చికిత్స నిమిత్తం కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.