కోనసీమ: ఐ.పోలవరం మండలం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా భద్రతా ప్రమాణాలను పాటించని రెండు ట్రావెల్స్ బస్సులను శనివారం సాయంత్రం రవాణా అధికారులు సీజ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించడంతో వాటి ఫిట్ నెస్‌ను రద్దు చేశామని డీటీవో శ్రీనివాసరావు తెలిపారు. యానం నుంచి అమలాపురం మీదుగా హైదరాబాద్ వెళ్లే బస్సులు కచ్చితంగా నిబంధనలను పాటించాలని సూచించారు.