HYD: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇవాళ ఇందిరాపార్క్‌లో బీసీ JAC ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షకు పిలుపునిచ్చింది. కేంద్రం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్ మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ధర్మ పోరాట దీక్షలో బీసీ JAC ఛైర్మన్ ఆర్. కృష్ణయ్య, బీసీ జేఏసీ వర్కింగ్ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరవుతున్నట్లు తెలిపారు.