HYD: చిలకలగూడ పీఎస్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ముషీరాబాద్ చౌరస్తా సమీపంలోని మెట్రో పిల్లర్ నంబర్ 1038 కరెంట్ ఆఫీస్ వద్ద పడి ఉన్న దాదాపు 40-45 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వివరాలు ఏమీ లేకపోవడంతో మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేశారు.