»54 Killed In Rain Fury In Himachal And Uttarakhand
Himachal pradesh: స్వాతంత్య్ర దినోత్సవం వేళ విషాదం..వరదలకు 54 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 54 మంది దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాల వల్ల చార్ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) వేళ విషాదం నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) ప్రాంతాల్లో భారీగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటి వరకూ 54 మంది ప్రాణాలు వదిలారు. కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. అనేక ప్రాంతాల్లో ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నదులు భీకరంగా ఉప్పొంగి ప్రవహించడంతో భారీ ఆస్తి నష్టం వాటిళ్లింది.
వరదల వల్ల ఒక్క హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లోనే 51 మంది మరణించారు. సిమ్లాలోని సమ్మర్ హిల్ ప్రాంతంలో శివాలయంపై రెండు కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో 14 మంది భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శిథిలాల కింది ఇంకొందరు చిక్కుకొని ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సోలాన్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు.
రాష్ట్రవ్యాప్తంగా 9 జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు (Weather department Warning) జారీచేసింది. భారీ వర్షాల వల్ల రూ.7,171 కోట్ల నష్టం వాటిళ్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌లోనూ వరదల వల్ల ముగ్గురు మరణించారు. మరో 10 మంది గల్లంతయ్యారు. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి వెళ్లే రహదారులపై వాహనాల రాకపోకలను ఆపివేశారు. చార్ధాయ్ యాత్రను మరో రెండు రోజుల పాటు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు.