E.G: మనస్థాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రమణక్కపేటలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. పదవ తరగతి చదువుతున్న చింతపల్లి నైపుణ్య (16) అనే విద్యార్థిని పరీక్షల సమయం దగ్గర పడుతుందని, చదువుపై దృష్టి పెట్టాలని తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది.