MNCL: జన్నారం మండలంలోని బాదంపల్లి-ధర్మారం మధ్యలో బైక్ కాలువలో పడి పూడూరి నరేష్ మృతి చెందాడని స్థానిక ఎస్సై అనూష తెలిపారు. బీర్పూర్కు చెందిన నరేష్, విష్ణువర్ధన్ బాదంపల్లిలోని అక్క ఇంటికి వచ్చి రాత్రి తిరిగి వెళుతున్న క్రమంలో బైక్ అదుపుతప్పి కాల్వలో పడడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. విష్ణువర్ధన్ కు గాయాలయ్యాయని ఎస్సై అనూష వివరించారు.