VSP: విశాఖలోని కప్పరాడ వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో సీతంపేటకు చెందిన గురుకుపల్లి ప్రవీణ్ కుమార్(20), దొండపర్తి ప్రాంతానికి చెందిన దువ్వపు ప్రశాంత్ కుమార్(20) అక్కడికక్కడే మృతి చెందారు. కప్పరాడ ప్రాంతానికి చెందిన నడిగాన మహేశ్(20) తీవ్రంగా గాయపడ్డాడు. మృతులను కేజీహెచ్ మర్చూరీకి తరలించారు.