NLR: ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను ఆత్మకూరు పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం వద్ద రెండు ట్రాక్టర్లు, గండ్లవీడు వద్ద రెండు ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సీఐ గంగాధర్, ఎస్సై జిలానీ దాడులు నిర్వహించారు. అనంతరం కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేశారు.