ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'గేమ్ చేంజర్'. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ నియమితులయ్యారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. నితీష్ కుమార్‌ను అధ్యక్షుడిగా పార్టీ అధినేత లాలన్‌సింగ్ ప్రకటించారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని పాటించనందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ తొమ్మిది విదేశీ క్రిప్టోకరెన్సీ, Binance, KuCoin వంటి ఆన్లైన్ డిజిటల్ అసెట్ ప్లాట్‌ఫారమ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇటీవల దళపతి విజయ్ గురువారం రాత్రి చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్లో విజయకాంత్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. చివరిసారి చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం తిరిగి వస్తుండగా చేదు అనుభవం ఎదురైంది.
కేంద్ర ప్రభుత్వం రెండు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వందే భారత్ స్లీపర్ వెర్షన్‌గా వస్తున్న ఈ హైస్పీడ్ రైళ్లను అమృత్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ప్రారంభించనున్నారు.
మణిపూర్ గాయకుడు, గీత రచయిత అఖు చింగంగ్బామ్ను కొందరు దుండగులు తుపాకీతో కిడ్నాప్ చేశారు. మణిపూర్‌లో గత కొన్ని నెలలుగా మెయిటీ, కుకీ వర్గాల మధ్య హింస జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.
బింబిసార తరువాత అదే స్థాయిలో ప్రేక్షకులు అంచనాలు పెట్టుకున్న చిత్రం డెవిల్. నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ జంటగా అభిషేక్ నామ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.