»If You Are Investing Money In Cryptocurrency Then Important News For You
Crypto Currency : క్రిప్టోకరెన్సీలో ఇన్వెస్ట్ చేస్తున్నారా.. ఈ వార్త చదివేయండి
మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని పాటించనందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ తొమ్మిది విదేశీ క్రిప్టోకరెన్సీ, Binance, KuCoin వంటి ఆన్లైన్ డిజిటల్ అసెట్ ప్లాట్‌ఫారమ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Crypto Currency : మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని పాటించనందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ తొమ్మిది విదేశీ క్రిప్టోకరెన్సీ, Binance, KuCoin వంటి ఆన్లైన్ డిజిటల్ అసెట్ ప్లాట్‌ఫారమ్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భారతదేశంలో మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని నిబంధనలను పాటించకుండా చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న ఈ తొమ్మిది సంస్థల URLలను బ్లాక్ చేయాలని ఆర్థిక నిఘా విభాగం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాసింది. Binance, KuCoin కాకుండా ఇతర వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లు Huobi, Kraken, Gate.io, Bittrex, Bitstamp, MEXC Global, Bitfinexలు కూడా ఉన్నాయి.
FIU INDతో రిజిస్ట్రేషన్‌తో సహా చట్టం ప్రకారం వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లపై రిపోర్టింగ్, రికార్డ్ కీపింగ్, ఇతర బాధ్యతలు ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చిలో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లను PMLA నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చింది. ఇప్పటివరకు 31 వర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్లో నమోదు చేసుకున్నారు.
క్రిప్టో ఇన్వెస్టర్ల మొత్తం సంఖ్య 1.9 కోట్లకు పైగానే
దేశంలో మొత్తం క్రిప్టో ఇన్వెస్టర్ల సంఖ్య 1.9 కోట్లకు పైగా ఉండగా వారిలో దాదాపు తొమ్మిది శాతం మంది మహిళా ఇన్వెస్టర్లు కావడం గమనార్హం. Coinswitch నివేదిక ప్రకారం.. దేశంలో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టేవారిలో 75 శాతం మంది యువత. వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉంటుంది. క్రిప్టో పెట్టుబడుల మొత్తం విలువలో ఐదో వంతు ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి మెట్రోలు మాత్రమే ఉన్నాయి. విలువ ప్రకారం క్రిప్టోలో పెట్టుబడి పెట్టడంలో ఢిల్లీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది.