Petrol Price: ఇన్ని రోజులుగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించేందుకు ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. లీటర్ పెట్రోల్‌పై 10 రూపాయలు, లీటర్ డీజిల్‌పై 8 రూపాయల తగ్గింపునకు ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలపనున్నారు. ఇది కొత్త సంవత్సర కానుకగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన కానుకగా పేర్కొంటున్నారు.
రేట్ల తగ్గింపునకు సంబంధించి ప్రధాని సంతకం చేసేందుకు వీలుగా ఇప్పటికే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఫైళ్లను సిద్ధం చేసిందని, వీటిని ప్రధాని మోడీ నిశితంగా పరిశీలించి నిన్న ఆమోదం తెలిపారని వార్తలు వస్తున్నాయి. ఈరోజు లేదా రేపటిలోగా దీనిపై అధికారిక ప్రకటన చేయబోతున్నారని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, దీంతో ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయని, అందుకే ఇప్పుడు విపక్షాలు ఈ డ్రామా ప్రారంభించాయని అంటున్నాయి.