ప్రకాశం: అవసరానికి మించి రసాయన ఎరువులు వాడటం వల్ల నేలలోని భూ భౌతిక లక్షణాలు దెబ్బతింటాయని, నేలలు నిస్సారమైపోతాయని వ్యవసాయ సహాయ సంచాలకుడు బాలాజీ నాయక్ అన్నారు. మర్రిపూడి మండలంలోని గుండ్ల సముద్రంలో ఏర్పాటు చేసిన రసాయన ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతి రైతు తనకు ఉన్న ఎకరా పొలంలోనైనా ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకోవాలని సూచించారు.
ATP: వస్తువులు, ఆహార పదార్థాల ప్యాకింగ్, బ్రాండింగ్ పై ఈనెల 25వ తేదీన శిక్షణ ఇవ్వనున్నట్లు DRDA ఇంఛార్జ్ పీడీ శైలజ తెలిపారు. ప్రశాంతి జిల్లా సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఔత్సాహిక పారిశ్రామిక వేతలకు శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 23వ తేదీ లోపు అనంతపురం DRDA కార్యాలయాన్ని సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
VZM: సోషల్ మీడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా అనుచితమైన పోస్టులు పెట్టీ, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో వాస్తవాలను వక్రీకరిస్తూ మతాలను, కులాలను, పార్టీలకు రెచ్చ గొడుతూ ఉన్నవారిపై పోలీసు శాఖ చూస్తూ ఉండదని ఎస్పీ హెచ్చరించారు.
VSP: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నూతనంగా నియమితులైన రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఈ. తలపాక సుజాత మాజీ మంత్రి, భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ఆమె శాలువాతో సత్కరించి, తన నియామకానికి సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
W.G: భూములకు సంబంధించి ఖచ్చితమైన వివరాల నమోదుకు ప్రభుత్వం చేపట్టిన రీసర్వేను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఉప తహసీల్దార్ వర్ధనపు కిషోర్ కోరారు. రుస్తుంబాదలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు. సర్వే ద్వారా భూ రికార్డులు పక్కాగా రూపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో సత్తిబాబు, సర్వేయర్ మణికంఠ, గ్రామస్థులు పాల్గొన్నారు.
BPT: సంతమాగులూరు(M)లో గొర్రెలు, మేకల పెంపకం దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌కి పెంపకం దారులు వినతి పత్రం అందజేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా జీవాలకు తాగునీరు, మేత కొరత తీవ్రంగా ఉందన్నారు. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఏడీ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.
అన్నమయ్య: నిమ్మనపల్లె రోడ్డులోని లెవెల్ క్రాసింగ్ గేట్ నంబరు 101ను ఇవాళ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూసివేయనున్నారు. రైల్వే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించాలని సూచించారు. ఈ సమయంలో గేటు వద్ద రాకపోకలు పూర్తిగా నిలిపివేయబడతాయన్నారు.
సత్యసాయి: కదిరి వైసీపీ కార్యాలయంలో బీసీ గళం పోస్టర్‌ను నియోజకవర్గ సమన్వయకర్త బీయస్ మక్బూల్ గురువారం ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న అనంతపురంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. బీసీల హక్కుల కోసం గళం ఎత్తాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
NTR: గతంలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులపై పోలీసులు చర్యలు చేపట్టారు. వారిని తహశీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేసినట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో లేడీ డాన్ రంగమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలను ఎరగా వేసి అమాయకుల నుంచి ఈ ముఠా సుమారు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ముఠాకు సహకరించిన సీఐలు శ్రీహర్ష, రాజేంద్రనాథ్ యాదవ్‌ను ఇప్పటికే వీఆర్‌కు బదిలీ చేశారు. మరో ఎనిమిది మంది కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ కొనసాగుతోంది.
ప్రకాశం: మద్దిపాడులోని ఓ పెట్రోల్ బంక్‌లో గురువారం తెల్లవారు జామున కారులో వచ్చిన వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. కారులో డీజిల్ పోయాలని బంక్‌లో పనిచేసే వ్యక్తి వద్ద నుంచి రూ.5 వేలు అపహరించి పరారయ్యాడు. పరారవుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత నిందితుడు గుంటూరు వైపు పారిపోయాడు.
E.G: రాజమండ్రి 16వ వార్డులో BJP నేత అడపా వరప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. వార్డులోని గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు సామూహికంగా సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. స్త్రీలకు గాజులు వేసి, పసుపు కుంకుమలు ఇచ్చి, సంప్రదాయబద్ధంగా ఆశీర్వచనాలు అందించారు.
NDL: బేతంచెర్ల సంజీవనగర్‌కు చెందిన వడ్డె సురేష్ (38) మద్యం సేవించడంపై భార్యతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
AKP: నక్కపల్లి డిగ్రీ కళాశాలకు శంకుస్థాపన చేపట్టి పరవాడలో నూతన డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జీ. ఫణీంద్ర కుమార్ బుధవారం డిమాండ్ చేశారు. అనకాపల్లిలోని సీపీఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. సీఎం పరిశ్రమలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. కళాశాలలు ఏర్పాటు చేయకపోతే సీఎం పర్యటనలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
VZM: ఎస్.కోట పోలీసు స్టేషన్ పరిధిలోని చైతన్య జూనియర్, డిగ్రీ కాలేజీలో మత్తు పదార్థాలపై సీఐ నారాయణమూర్తి విద్యార్థులకు బుధవారం పలు పోలీసు చట్టాలపై అవగాహన కల్పించారు. రద్దీ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ల ముసుగులో ఓటీపిలు చెప్పకూడదని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై పోలీసు స్టేషనుకు సమాచారం ఇవ్వాలని కోరారు.