• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సేవాభావాన్ని చాటుకున్న మంత్రి మండిపల్లి

అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజలతో ఆత్మీయంగా మమేకమయ్యారు. వృద్ధులు, దివ్యాంగులతో కూర్చొని వారి సమస్యలను శ్రద్ధగా విని ధైర్యం చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. దీంతో స్థానికులు మంత్రి శైలిని ప్రశంసించారు.

April 22, 2026 / 01:10 PM IST

మాజీ సర్పంచ్‌కు సన్మానం

PPM: జిల్లా గుమ్మలక్ష్మీపురంలో మాజీ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్, ఉప సర్పంచ్ కిషోర్‌లకు ఆర్టీసీ షాప్ ల యూనియన్ సభ్యులు ఎద్దు మురళి, నారా సురేష్, నెమలిపురి మురళి ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద జరిగిన కార్యక్రమానికి వ్యాపారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వారి సేవలను ప్రశంసించారు.

April 22, 2026 / 01:00 PM IST

కామవరపుకోట VOA లకు స్మార్ట్ ఫోన్‌లు పంపిణీ

ELR: మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ కామవరపుకోట మండలానికి చెందిన 53 మంది VOAలకి స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. డిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మహిళలకు చేరువ కావడం ఎంతో అవసరమని అన్నారు.

April 22, 2026 / 12:54 PM IST

కంచాలమ్మ గండి చెరువును పరిశీలించిన మంత్రి

అన్నమయ్య: జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా కంచాలమ్మ గండి చెరువును మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ నిశాంత్ కుమార్ పరిశీలించారు. మాండవ్య నది శుభ్రత, చెక్‌డ్యాముల నిర్మాణం, సప్లై ఛానల్ మరమ్మతులతో నీటి నిల్వ పెంచాలని మంత్రి సూచించారు. సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

April 22, 2026 / 12:48 PM IST

మహిళా రక్షణ, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీ

సత్యసాయి: పరిగి మండల కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ మహిళా రక్షణ, మహిళా చట్టాలపై అవగాహన ర్యాలీతోపాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై రవికుమార్ మాట్లాడుతూ.. శక్తి యాప్, 100, 112 వంటి అత్యవసర సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ప్రతి ఒక్కరికీ అవసరమని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

April 22, 2026 / 12:43 PM IST

వైస్ కెప్టెన్‌గా బాపట్ల విద్యార్థి

BPT: శ్రీలంకలో జరిగే గోల్ షాట్ బాల్ పోటీలకు బాపట్ల విద్యార్థి ఎంపికయ్యాడు. మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న గోదావరి మహిమ రాజు.. భారత జూనియర్ బాలుర జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ నెల 24 నుంచి 28 వరకు కొలంబోలో ఈ పోటీలు జరగనున్నాయి. అంతర్జాతీయ స్థాయికి ఎదగడం పట్ల అతడిని హెచ్‌ఎం, పీడీ కత్తి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు.

April 22, 2026 / 12:43 PM IST

విద్యార్థులలో పర్యావరణ చైతన్యం

VSP: గాజువాక మండలం సాయిరాం నగర్‌లో ధరిత్రి దినోత్సవం సందర్భంగా కూర్మమ్మ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వామి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో డ్రాయింగ్, డిబేట్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, నిర్వాహకులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.

April 22, 2026 / 12:42 PM IST

పెనుమాకలో వీడని నీటి కష్టాలు

GNTR: తాడేపల్లి మండలం పెనుమాక 7, 8 వార్డుల కొండ ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇళ్లకు కుళాయిలున్నా ఏళ్లుగా చుక్క నీరు రావడం లేదు. కృష్ణా నది పక్కనే ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. నీరు ఇవ్వకున్నా పన్నులు కట్టాలని అధికారులు అడుగుతున్నారు. దీంతో మంచినీరు కొనుక్కుంటూ జనం అవస్థలు పడుతున్నారు. తమ నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

April 22, 2026 / 12:41 PM IST

భానుడి ప్రతాపం.. ఇంట్లో జనం

ATP: జిల్లాలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. వారం రోజులుగా ఎండ తీవ్రత అధికమవడంతో ప్రజలు అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి వేడి గాలులు మొదలై, రాత్రి వరకు ఉక్కపోత కొనసాగుతోంది. ఎండల ధాటికి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

April 22, 2026 / 12:39 PM IST

చురుగ్గా తాండవ రహదారి నిర్మాణ పనులు

AKP: నాతవరం నుంచి తాండవకు వెళ్లే 7 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ రోడ్డు అధ్వాన్నంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను గుర్తించిన స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు రూ.3.5 కోట్లు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నిర్మాణం వేగవంతం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

April 22, 2026 / 12:29 PM IST

లాడ్జీల్లో పోలీసుల దాడులు

KDP: నేరాల నియంత్రణ, ప్రజల భద్రత కోసం జిల్లా వ్యాప్తంగా రాత్రి పెట్రోలింగ్‌ను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాలతో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, లాడ్జిల్లో దాడులు, తాళాలు వేసిన ఇళ్ల వద్ద నిఘా పెంచారు. అనుమానాస్పద సమాచారం ఉంటే 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

April 22, 2026 / 12:27 PM IST

గురుకుల ప్రవేశ పరీక్షలో విద్యార్థుల విజయకేతనం

ప్రకాశం: శానంపూడి ZPHS సింగరాయకొండ విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో విజయకేతనం ఎగరవేశారు. ఏకంగా 11 మంది విద్యార్థులు 5వ తరగతి సీట్లు సాధించి రికార్డు సృష్టించడం విశేషం. ఉపాధ్యాయులు, న్యాయవాది వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు బుధవారం పాఠశాలలో ప్రతిభచూపిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘన విజయంపై స్థానికులు గర్వపడుతున్నారు.

April 22, 2026 / 12:27 PM IST

వాకర్స్‌పై యూజర్ చార్జీలు రద్దు చేయాలి: సీపీఐ

VSP: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఇవాళ ధర్నా జరిగింది. పార్కులు, స్టేడియాల్లో వాకర్స్‌పై ఏడాదికి రూ.720 యూజర్ చార్జీలు విధించడం ప్రజా వ్యతిరేకమని జిల్లా కార్యదర్శి ఎస్‌కె రహమాన్ విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

April 22, 2026 / 12:25 PM IST

కలిగిరికి నూతన సీఐ బాధ్యతలు స్వీకరణ

NLR: కలిగిరి సీఐ పి.వెంకటనారాయణను రేంజ్ వీఆర్‌కు బదిలీ చేస్తూ గుంటూరు ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో ఇవాళ వెంకటాచలం సీఐ పి.సుబ్బారావును కలిగిరి సీఐగా నియంచారు. సీఐను వీఆర్‌కు బదిలీ చేయడానికి గల కారణాలు తెలియరాలేదు.

April 22, 2026 / 12:14 PM IST

ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్‌ను విడుదల చేయాలి

AKP: ఎస్సీ కార్పొరేషన్ బడ్జెట్‌ను తక్షణమే విడుదల చేసి నిరుద్యోగ దళిత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు యర్రంశెట్టి పాపారావు డిమాండ్ చేశారు. నర్సీపట్నం మండలం చెట్టుపల్లిలో మాట్లాడుతూ.. ప్రతి ఏటా రావాల్సిన నిధులు ఆలస్యమవడంతో ఎస్సీ యువత నష్టపోతున్నారని,  దీనిపై ప్రభుత్వం స్పందించాలన్నారు.

April 22, 2026 / 12:13 PM IST