VSP: గాజువాక మండలం సాయిరాం నగర్లో ధరిత్రి దినోత్సవం సందర్భంగా కూర్మమ్మ స్కౌట్స్ అండ్ గైడ్స్, స్వామి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో డ్రాయింగ్, డిబేట్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, నిర్వాహకులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.