KRNL: పెద్దకడబూరు మండలం కల్లుకుంట గ్రామంలో గత 20 రోజులుగా తాగునీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవికాలంతో సమస్య మరింత తీవ్రం అయింది. బోర్లు కూడా సరిపడ నీరు ఇవ్వడం లేదని గ్రామస్థులు తెలిపారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించకపోతే ఎంపీడీవో కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
KDP: పులివెందులకు కృష్ణా జలాలను రప్పించిన ఘనత పూర్తిగా టీడీపీ ప్రభుత్వానిదేనని పులివెందుల మార్కెట్ యార్డు ఛైర్మన్ గడ్డం అమర్నాథ్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు.
NDL: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా కేంద్రం నంద్యాలలో శనివారం 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 10 రోజుల నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంది. చిన్నారులు, తల్లులతో పాటు వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ సోకకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని సూచించారు.
NDL: కొలిమిగుండ్ల మండలం బెలుం ZPHS పాఠశాలలో వంటగది నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. దీంతో అపరిశుభ్రత, అరకొర వసతుల మధ్యనే రేకుల షెడ్డులో నిర్వాహకులు వంటలు తయారుచేసి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. గత YCP హయాంలో వంటగది నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా, ఐదేళ్లయినా నిర్మాణం పూర్తి దశకు చేరుకోలేదు. దీనిపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేశారు.
KDP: బ్రహంగారిమఠంలోని పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాములవారి మఠంలో స్వామివారికి ఆరాధన గురు పూజ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా.. శనివారం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతంతో ప్రారంభించి విశేష అభిషేకాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గుడి ఉత్సవం చేశారు.
CTR: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకానికి చిత్తూరుకు చెందిన దాత సుబ్రహ్మణ్యం నాయుడు రూ.1,02,000 విరాళం అందించారు. ఇందులో నిత్య అన్నదానం ట్రస్ట్‌కు రూ.51,000, గో సంరక్షణ ట్రస్ట్‌కు రూ.51,000 చెక్కుల రూపంలో సమర్పించారు. దాతకు ఆలయ అధికారులు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అన్నమయ్య: అందరం కలిసి మలేరియా రహిత సమాజాన్ని నిర్మించుకుందామని ఆకేపాడు, మన్నూరు ఆరోగ్య కేంద్రం వైద్యులు పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ‘మనం సాధించగలం.. మనం తప్పక సాధించాలి’ అనే నినాదంతో శనివారం రాజంపేట ఏరియా హాస్పిటల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఇంటి పరిసరాలలో వారం కంటే ఎక్కువ రోజులు నీటిని నిల్వ లేకుండా చూసుకోవాలని అన్నారు.
KKD: పెద్దాపురంలో వైసీపీ విలేఖరుల సమావేశం నిర్వహించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా విమర్శించారు. రంగంపేట మండలం దొడ్డిగుంటలో జరిగిన ఘటనలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు కేంద్రబిందువుగా మారిందని మండిపడ్డారు.
KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ పెట్రోల్ బంక్ స్కాంలో 9 మంది అధికారులతో విచారణ సాగుతుండగా.. పెట్రోల్ బంక్ పూర్వపు మేనేజర్ పులివెందుల మున్సిపల్ ఉద్యోగి ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2022 జనవరిలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారు. ప్రారంభం నుంచి మొన్నటి వరకు ప్రవీణ్ మేనేజరుగా విధులు నిర్వహించారు.
SS: పుట్టపర్తి నియోజకవర్గంలోని 193 చెరువులు, రెండు రిజర్వాయర్లకు నీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి తెలిపారు. అనంతపురంలో జరిగిన జడ్పీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు భూసేకరణకు రూ.90 కోట్లు అవసరం కాగా, మొదటి విడతగా రూ.40 కోట్లు మంజూరై పనులు ప్రారంభమయ్యాయన్నారు. దీంతో 20 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
ATP: గుంతకల్లులోని ఉర్దూ జూనియర్ కళాశాలలో మరమ్మత్తు పనుల కోసం రూ.50లక్షల నిధులతో శనివారం మండల ఇన్‌ఛార్జ్ నారాయణస్వామి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పూజ చేసి పనులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో రూ.8 కోట్లతో నిర్మించిన ఈ కళాశాల గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాడైపోయిందన్నారు. కూటమి ప్రభుత్వంలో కళాశాలలో మరమత్తు పనులు చేపట్టామన్నారు.
గుంటూరు జిల్లా తెనాలిలో పుట్టిన బెల్లం జిలేబి ప్రత్యేక రుచితో గుర్తింపు పొందింది. చీమకుర్తి సుబ్బయ్య ప్రారంభించిన ఈ వ్యాపారం “జిలేబీ కొట్ల బజారు”గా ఖ్యాతి పొందింది. సాంప్రదాయ పద్ధతులు, బెల్లం పాకం వల్ల ఈ జిలేబి దేశ విదేశాల్లో ప్రసిద్ధి చెందింది. పండుగలు, వేడుకల్లో తెనాలి జిలేబి ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.
NTR: ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాదచారులకు చల్లని మజ్జిగను జర్నలిస్ట్‌లు పంపిణీ చేశారు. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత పెరుగుతూ ఉండటంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావడం ప్రజలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో దారిన పోయే వారికి ఉపశమనం కలిగించేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అధికారులు పాల్గొన్నారు.
E.G: పంచాయితీ నిధులు దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. కోలమూరు పంచాయతీలో ఉన్న అనేక సమస్యలు అభివృద్ధి పనులపై కమిషనర్‌తో కలిసి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. గ్రామంలో పారిశుద్ధ్యం అసలు బాగాలేదని ఎక్కడి చెత్త అక్కడే పెరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
PLD: సంతమాగులూరులో అనారోగ్యంతో బాధపడుతున్న ఏల్చూరు గ్రామానికి చెందిన అల్లడి వెంకటేష్ కుటుంబానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అండగా నిలిచారు. వెంకటేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో, మంత్రి చొరవతో మంజూరైన రూ. 2,10,000 LOC చెక్కును శనివారం ఏల్చూరు టీడీపీ కార్యాలయంలో అందజేశారు.