• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అనంతపురం హనీ ట్రాప్ కేసులో మరో సీఐ?

అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపారు. ఈ కేసులో మరో సీఐ, కొంతమంది కానిస్టేబుళ్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.

April 26, 2026 / 11:20 AM IST

‘ప్రతి ఒక్కరూ జనగణనలో భాగస్వాములు కావాలి’

SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం జనగణనపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకుంటూ, జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, పురపాలక సిబ్బంది, టీడీపీ నేతలు పాల్గొన్నారు.

April 26, 2026 / 11:10 AM IST

రచయిత ఎల్‌ఆర్ స్వామికి నివాళులు

విశాఖ: ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత ఎల్‌ఆర్ స్వామి భౌతికకాయానికి ఆదివారం విశాలాక్షినగర్‌లోని కుమార్తె ఇంటి వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. సీపీఐ నేత జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. స్వామి అనేక అనువాద గ్రంథాలను విశాలాంధ్ర ద్వారా వెలువరించారని తెలిపారు. ‘అర్ధనారీశ్వరుడు’ అనువాదం కోసం ఆయన చేసిన శ్రమను గుర్తుచేశారు.

April 26, 2026 / 11:07 AM IST

గంజాయి స్వాధీనం: ఆరుగురు అరెస్టు

E.G: ముందస్తు సమాచారం మేరకు దాడి చేసి 4.8 కిలోల గంజాయితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి తెలిపారు. సీతంపేట వద్ద గంజాయి విక్రయిస్తున్న నిడదవోలుకు చెందిన శృతి వెంకట సాయి సతీష్, భాను ప్రకాష్, సంతోష్, మద్దూరుకు చెందిన మిస్ కుమార్, సంతోష్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని చెప్పారు.

April 26, 2026 / 11:00 AM IST

పెట్రోల్ బంకుల వద్ద భారీగా రద్దీ

KDP: కమలాపురంలో పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. ముందస్తుగా ఇంధనం నింపించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పెట్రోల్ బంకులకు చేరడంతో బంకుల వద్ద పొడవైన క్యూలు ఏర్పడి, కొంతమంది గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రద్దీ కారణంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది.

April 26, 2026 / 10:58 AM IST

డీజిల్ కొరత.. బంకుల్లో ‘నోస్టాక్’ బోర్డులు

NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలో డీజిల్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ అన్ని బోర్డులు దర్శనమిస్తున్నాయి. బంకులకు వచ్చిన వాహనదారులు వెనుదిరిపోతున్నారు. దీంతో ఆటో వాలాలు, వ్యవసాయంపై ఆధారపడిన టాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి డీజల్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

April 26, 2026 / 10:39 AM IST

లేపాక్షిలో సమాచార కమిషనర్ పర్యటన

సత్యసాయి: రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ గాజుల ఆదెన్న ఆదివారం ఉదయం 11.00 గంటలకు లేపాక్షి శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయ దర్శనం అనంతరం అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆయన పర్యటన సందర్భంగా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలు కూడా కట్టుదిట్టంగా చేపట్టారు.

April 26, 2026 / 10:33 AM IST

విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

PLD: పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలో శ్రీ బద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా గుడిని నిర్మాణం చేపట్టాలన్న సంకల్పం, గ్రామ వాసుల కళ నెరవేరిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ స్వర్ణకుమారి పాల్గొన్నారు.

April 26, 2026 / 10:29 AM IST

అసాంఘిక శక్తులపై తాళ్ళపూడి పోలీసులు ఉక్కుపాదం

E.G: తాళ్ళపూడి మండల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తాళ్ళపూడి ఎస్సై టి.రామకృష్ణ హెచ్చరించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నిఘా వేయడానికి వీలుపడని గోదావరి చుట్టు పక్క ప్రాంతాలు, నిర్మానుష్య ప్రాంతాలలో జరుగుతున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలను గుర్తించేందుకు డ్రోన్ ఉపయోగించారు.

April 26, 2026 / 10:28 AM IST

శ్రీముఖలింగంలో ఇష్టరాజ్యంగా ప్రసాదం అమ్మకాలు ?

SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం జలుమూరు మండలం శ్రీముఖలింగం స్వామి వారి ప్రసాదం అమ్మకాల్లో ఇష్ట రాజ్యంగా డబ్బులు దోచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ తరపున ప్రసాదం అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రసాదం వద్ద బోర్డు పది రూపాయలు అని ప్రకటన చేశారు. టికెట్ ఇవ్వకుండా కేవలం డబ్బులు మాత్రమే తీసుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. 

April 26, 2026 / 10:28 AM IST

పెద్దాపురం పెట్రోల్ బంక్‌లో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీలు

KKD: పెద్దాపురం మండలంలోని పెట్రోల్ బంక్‌లో తహశీల్దార్ వెంకటలక్ష్మి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గత రెండు రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తహశీల్దార్ తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పెద్దాపురం మండలంలోని కాండ్రకోట, పులిమేరు, వడ్లమూరు పెట్రోల్ బంకులను తహశీల్దార్ పరిశీలించారు.

April 26, 2026 / 10:26 AM IST

కన్నుమూసినా.. మరో కంటికి వెలుగై..!

W.G: మొగల్తూరుకు చెందిన అలపాటి రాజేశ్ (31) ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ, శనివారం బ్రెయిన్ డెడ్ అవడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టెడు దుఃఖంలోనూ రాజేశ్ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. తద్వారా మరికొందరికి ప్రాణభిక్ష పెట్టి రాజేశ్ ఆదర్శంగా నిలిచారు.

April 26, 2026 / 10:19 AM IST

నరసన్నపేటలో మే 9న సీఎం పర్యటన

SKLM: నరసన్నపేట నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు మే 9న పర్యటించనున్నట్లు స్థానిక టీడీపీ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. జలుమూరు మండలం అక్కు రాడ గ్రామంలో నిర్వహించనున్న “మీ భూమి-మీ హక్కు” కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

April 26, 2026 / 10:13 AM IST

పన్ను చెల్లింపునకు నాలుగు రోజులే గడువు: కమిషనర్

KRNL: ఆస్తి పన్ను రాయితీతో చెల్లించేందుకు మరో నాలుగు రోజుల మాత్రమే గడువు మిగిలి ఉందని శనివారం కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని వినియోగించుకోవాలని పన్ను చెల్లింపుదారులను కోరారు. గడువు ముగిసిన తర్వాత పూర్తి పన్నుతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

April 26, 2026 / 10:10 AM IST

వడదెబ్బతో యువ వ్యాపారి మృతి

విజయనగరం: రాజాం మండలం దోసరిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బట్టల వ్యాపారం కోసం గుమ్మలక్ష్మీపురం వెళ్లిన యువకుడు బాబి వడదెబ్బకు గురై అస్వస్థత చెందాడు. వెంటనే తోటి వ్యాపారులు కురుపాం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబానికి అండగా నిలిచిన బాబి మృతి స్థానికులను కలచివేసింది.

April 26, 2026 / 10:09 AM IST