• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మట్టి కుప్పను తప్పించబోయి ఆటో డ్రైవర్ మృతి!

PLD: కారంపూడి రోడ్డుపై ఉన్న మట్టి కుప్పను తప్పించబోయి ఆటో పల్టీ కొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. చినగార్లపాడుకు చెందిన కె. జానీ బాషా (24) కారంపూడి నుంచి వస్తుండగా బ్రహ్మనాయుడు కాలనీ మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆటో కింద పడి తలకు బలమైన గాయాలు కావడంతో జానీ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

May 30, 2026 / 08:56 PM IST

వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NTR: కంచికచర్ల మండలం బత్తినపాడు గ్రామంలోని నూతన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. కూటమి నేతలు, భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, నందిగామ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించారు.

May 30, 2026 / 08:45 PM IST

బద్వేలులో పట్టపగలు ఇంట్లో దొంగతనం

KDP: బద్వేలులోని సిద్దవటం రోడ్డులో ఉన్న శివరామకృష్ణ నగర్ 5వ వీధిలో పట్టపగలు చోరీ జరిగింది. బి.నరసింహారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు సుమారు 16 తులాల బంగారం,రూ.1.85 లక్షల నగదు,వెండి వస్తువులను అపహరించినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

May 30, 2026 / 08:39 PM IST

పాలకొల్లులో దాసరికి నివాళి

W.G: పాలకొల్లులో దర్శకరత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా అభిమానులు ఆయన కాంస్య విగ్రహానికి నివాళులర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, నటుడిగా, రచయితగా, శతాధిక చిత్రాల దర్శకుడిగా ఆయన సాధించిన ఘనతలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు. తన సినిమాల ద్వారా సమాజంలోని లోపాలను ఎండగడుతూ రికార్డులు సాధించి, పాలకొల్లు కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.

May 30, 2026 / 08:39 PM IST

కొండపిలో గ్రంథాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ప్రకాశం: కొండపి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నూతన గ్రంధాలయ భవన నిర్మాణానికి మంత్రి స్వామి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 95 లక్షల వ్యయంతో ఈ గ్రంథాలయం నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ గ్రంథాలయం అన్ని వసతులతో కొండేపికే ఒక తలమానికంగా నిలవనుందని మంత్రి అన్నారు.

May 30, 2026 / 08:37 PM IST

స్వర్ణ పంచాయతీలో డీఎల్‌డీవో అకస్మిక తనిఖీలు

BPT: కారంచేడు మండలం స్వర్ణ గ్రామంలో డీఎల్‌డీవో కే. పద్మావతి శనివారం తనిఖీ చేశారు. గ్రామపంచాయతీలో PGRSలో వచ్చిన కంప్లైంట్లను విచారణ చేసి అధికారులకు తగు సూచనలు చేశారు. అలాగే గ్రామ అభివృద్ధికి నిధులు ఎన్ని కేటాయించారు. జరుగుతున్న పనుల గురించి ఆరా తీశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పంచాయతీ అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.

May 30, 2026 / 08:37 PM IST

మహిళల భద్రతపై పోలీసులు అవగాహన

ELR: పెదపాడు మండలం కొత్తముప్పారులో మహిళల భద్రతపై పోలీసులు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో ‘శక్తి యాప్’ ఎలా ఉపయోగపడుతుందో ఎస్సై ఆర్. శ్రీనివాస్ వివరించారు. యాప్‌లోని SOS బటన్ నొక్కితే చాలు, జీపీఎస్ ద్వారా లొకేషన్ పోలీసులకు చేరుతుందన్నారు. కుటుంబ సభ్యులకు కూడా అలర్ట్ వెళ్లే ఈ యాప్, మహిళలకు రక్షణ కవచమని తెలిపారు.

May 30, 2026 / 08:35 PM IST

‘ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలి’

E.G: కొవ్వూరులో ‘సర్ ప్రోగ్రాం’ సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా మాజీ MLA, కొవ్వూరు వైసీపీ ఇంఛార్జ్ తలారి వెంకట్రావు మాట్లాడారు. బూత్ స్థాయి నుంచి ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. గత ఎన్నికల ఓట్ల తీరును బట్టి ఓటర్ల జాబితాలో మార్పులు జరిగే ప్రమాదముందని హెచ్చరించారు.

May 30, 2026 / 08:30 PM IST

వట్టిచెరుకూరు భూ సమస్యకు పరిష్కారం

GNTR: శతాబ్దకాలంగా 22ఏ నిషేధిత జాబితాలో ఉండి భూ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వట్టిచెరుకూరు గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకోవడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడు ఎమ్మెల్యే డా. బూర్ల రామాంజనేయులును నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో కలిసి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.

May 30, 2026 / 08:30 PM IST

గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: SP

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలువు నిచ్చారు. గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు, రెవెన్యూశాఖలతో సమిష్టిగా పని చేయాలని ఎస్పీ దామోదర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆద్వర్యంలో నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని శనివారం జూమ్ కాన్ఫరెన్స నిర్వహించారు.

May 30, 2026 / 08:30 PM IST

కూటమి పాలనలో కుట్రలకే ప్రాధాన్యం: కాకాణి

NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి శనివారం తోటపల్లి గూడూరు మండలంలోని కామాక్షి నగర్, తోటపల్లి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి కుట్రలు, రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఎస్ఐర్ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

May 30, 2026 / 08:20 PM IST

జీవిత భాగస్వాముల త్యాగం వెలకట్టలేనిది: ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లి పోలీసు సమావేశ మందిరంలో ముగ్గురు ఏఎస్సైల పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. 35 ఏళ్లకు పైగా సేవలందించిన ఏఎస్సైల మాబూ సాహెబ్, వెంకటరమణ, శేఖర్ రావులను ఎస్పీ ధీరజ్ సత్కరించి, వారి సేవలను కొనియాడారు. పోలీసుల సుదీర్ఘ సేవలో జీవిత భాగస్వాముల త్యాగం ఎంతో గొప్పదని ఎస్పీ పేర్కొన్నారు.

May 30, 2026 / 08:17 PM IST

మంచినీటి చెరువు పనుల పరిశీలించిన ఎంఈవో

ELR: గుండుగొలనులోని వింధ్యవాసిని మంచినీటి చెరువు మరమ్మతు పనులను స్పెషల్ ఆఫీసర్, ఎంఈవో భాస్కర్ కుమార్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేసవిలో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చెరువుల వద్ద నిఘా పెంచుతామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

May 30, 2026 / 08:16 PM IST

స్మార్ట్ పోలీసింగ్‌లో అగ్రగామిగా నిలవాలి: SP

KDP: స్మార్ట్ పోలీసింగ్‌లో కడప జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అన్నారు. శనివారం డీపీవోలో నేర సమీక్ష నిర్వహించిన ఆయన, డ్రోన్లు, ఈ-సాక్ష్య యాప్‌ల ద్వారా నేరాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అసాంఘిక శక్తులు, రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నేరాలు పునరావృతమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు.

May 30, 2026 / 08:15 PM IST

ఆకివీడులో ఘనంగా సీఐటీయూ దినోత్సవం

WG: ఆకివీడులో శనివారం సీఐటీయూ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంఘం జెండాను ఆవిష్కరించారు. కార్మిక ఉద్యమాల్లో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తోందని ఆకివీడు మండల కన్వీనర్ బొడ్డుపల్లి రాంబాబు అన్నారు. కార్మికుల హక్కుల కోసం భవిష్యత్తులో జరిగే పోరాటాల్లో తమ సంఘం ముందుండి నడిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

May 30, 2026 / 08:14 PM IST