AKP: అనకాపల్లి నూకంబిక అమ్మవారిని ఆదివారం సినీనటి శ్రీలక్ష్మి దర్శించుకున్నారు. నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ నిమిత్తం వచ్చిన తాను ఆలయ విశిష్టత తెలుసుకొని దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. త్వరలో తాను నటించిన సినిమాలు విడుదలవుతాయని చెప్పారు. ఆలయ కమిటీ సభ్యులు దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు.
CTR: అమెరికా ఇండియానా యూనివర్సిటీలో మాజీ మంత్రి రోజా కుమార్తె అన్హు మాలిక ప్రతిష్టాత్మక అవార్డు సొంతం చేసుకుంది. యూనివర్సిటీలో 2026 సంవత్సరానికి హెర్మన్ బీ వెల్స్ అవార్డు గెలుచుకున్నట్లు రోజా కుటుంబం తెలిపింది. ఇది తమ కుటుంబానికి గర్వకారణంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
PPM: గొట్టివలస గ్రామ పరిసరాల్లో ఆదివారం ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా పొలాలకు వెళ్లే వారు, మామిడి తోటలు, జీడి తోటలకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. అవసరం లేకుండా ఒంటరిగా వెళ్లకుండా, సమూహాలుగా వెళ్లడం మంచిదని సూచించారు.
ఏలూరు: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి నిన్న శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆయన త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ ఛైర్మన్ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అల్లూరి జిల్లా ఏజెన్సీ వారపు సంతలో చింతపండు ధరలు భారీగా పడిపోయాయి. గత వారం రూ.1400–1600 ఉన్న 20 కిలోల గంప ఈ వారం రూ.600–800కే పడింది. కొనుగోలుదారులు లేక రైతులు సరుకును తిరిగి తీసుకెళ్లాల్సి వస్తుంది. జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యమని గిరి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా GCC ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
ప.గో: ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారం గ్రామంలోని చెరువుగట్టుపాలెం వద్ద పంట కాలువ ఒక గుర్తు తెలియని మృతదేహాన్ని ఆదివారం కనుగొన్నట్లు ఉండి ఎస్సై నసీరుల్లా అహ్మద్ తెలిపారు. అది పురుషుని మృతదేహం అని అన్నారు. మృతదేహంపై నలుపు రంగు జీన్ ప్యాంటు, తెలుపు రంగు బనీను వేసుకుని ఉన్నాడు. అతడి వయస్సు సుమారు 35 సం లు నుంచి 40 సం.లు మధ్య ఉండొచ్చని తెలిపారు.
AKP: ఎండల ప్రభావంతో వడ్డాదిలో ఆదివారం జరిగిన నాటుకోళ్ల సంత వెలవెలబోయింది. వేడి తీవ్రత కారణంగా పెంపకందారులు అమ్మకానికి కోళ్లను తక్కువగా తీసుకువచ్చారు. దీంతో సంతకు వచ్చిన కోళ్ల సంఖ్య తగ్గింది. ఒక్కో కోడి బరువును బట్టి రూ.1000 నుంచి రూ.3000 వరకు విక్రయించారు. రెండు కేజీల కోడి రూ.1500 వరకు అమ్ముడైంది. గత వారంతో పోలిస్తే ధరలు స్థిరంగానే ఉన్నాయి.
VSP: పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యంపై జివిఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ కఠిన చర్యలు చేపట్టారు. ఉత్తర జోన్ వార్డు నెం. 25లో తనిఖీల సందర్భంగా రహదారులపై నిర్మాణ వ్యర్థాలను పడేసిన భవన యజమానికి రూ. 25,000 జరిమానా విధించారు. బహిరంగ ప్రదేశంలో చెత్త పారబోసిన ఒక వ్యాపార సంస్థను సీజ్ చేశారు. పారిశుధ్య విషయంలో అలక్ష్యం సహించబోమని హెచ్చరించారు.
SKLM: స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న గారి 19వ వర్ధంతి సందర్భంగా సోంపేటలోని సర్దార్ ఘాట్ వద్ద ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఆయన విగ్రహానికి మాజీ మంత్రివర్యులు, ఆయన కుమారుడు గౌతు శ్యాంసుందర్ శివాజీ , గౌతు విజయమ్మతో కలిసి పుష్పాంజలి ఘటించి తండ్రి సేవలను స్మరించుకున్నారు.
కోనసీమ: బీజేపీ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా అమలాపురంకు చెందిన కొండేటి జయలక్ష్మి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమెను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ ఆయన నివాసంలో ఆదివారం శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో మహిళా మోర్చా మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని నల్లా పవన్ ఆమెకు సూచించారు.
ATP: గుత్తి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో రిల్స్ తీస్తే చర్యలు తప్పవని సీఐ రామారావు హెచ్చరించారు. ఇటీవల కొంతమంది యువత సామాజిక మధ్యమాలలో ఫేమ్ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల గురించి సెల్‌ఫొన్‌లో రీల్స్ చిత్రీకరిస్తూ ప్రజలకు అసౌకర్యం కల్పిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలు పరిష్కరించేందుకు సహాయం పొందేందుకు ప్రాధాన్యం పొందిన స్థలం పోలీస్ స్టేషన్ అన్నారు.
E.G: కడియం మండలం వీరవరం గ్రామంలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ జనసైనికులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ ఇటీవల ఆరోగ్య సమస్యలతో శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలోకి రావాలని పార్థించారు.
VZM: ఈ నెల 21, 23, 24 తేదీల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 21న ఫుట్ బాల్ మహిళా, 23న ఫుట్ బాల్ పురుషులు, 24న బాక్సింగ్ బాలబాలికలు ఎంపిక పోటీలు విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.
NTR: విజయవాడ వాంబే కాలనీ ఎంపీ లాడ్స్ నిధులు రూ.75 లక్షలతో నిర్మించనన్ను కమ్యూనిటీ హాల్‌కు ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి ఎంపీ కేశినేని చిన్ని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ATP: గుత్తి శివారులోని చెరువు కట్ట వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన టూ వీలర్‌తో నిలబడి ఉన్న హరిజన రాము అనే వ్యక్తిపై వెనుక వైపు నుంచి లారీ బైక్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాముకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.