• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నైట్ ప్యాంటుతో ఆఫీసుకొచ్చిన డిజిటల్ అసిస్టెంట్

BPT: నైట్ ప్యాంటుతో విధులకు హాజరైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ వి.వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటుతో విధులకు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు.

April 18, 2026 / 08:25 AM IST

మాదకద్రవ్యాల నిర్మూలనకు 100 రోజుల ప్రణాళిక

శ్రీకాకుళం జిల్లాలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయడానికి 100 రోజుల ప్రణాళిక అమలు చేయాలని విశాఖ రేంజ్ ఐజీ గోపీ నాథ్ జెట్టి అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డితో ఆయన వీసీలో సమీక్ష నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన యువతను తిరిగి సమాజంలో కలపడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. సంకల్పం క్లబ్బులు ఏర్పాటు చేయాలని అన్నారు.

April 18, 2026 / 08:21 AM IST

PGRSలో విన్నపం.. భీమలమ్మకు క్లాప్ మిత్రగా ఛాన్స్

ASR: ముంచంగిపుట్టు (M) జర్జుల పంచాయతీకి చెందిన ఒంటరి మహిళ వీ.భీమలమ్మకు కలెక్టర్ టీ.నిశాంతి తక్షణ ఉపాధి కల్పించారు. శుక్రవారం జరిగిన PGRSలో తన పేదరికం, పాప చదువు గురించి భీమలమ్మ మొరపెట్టుకోగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఆమెకు నెలకు రూ.6వేల వేతనంతో ‘క్లాప్ మిత్ర’గా నియమించారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఉపాధి కల్పించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.

April 18, 2026 / 08:10 AM IST

మురుగు నీళ్ల మధ్య జీవనం

PPM: పాలకొండ పట్టణంలోని నీళ్ల ట్యాంకు వీధిలో కాలువలు పూడికతో నిండిపోవడంతో, మురుగు నీరు వీధి రోడ్డు పై ప్రవహిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలు కష్టంగా మారడంతో పాటు దోమల పెరుగుదల, దుర్వాసన కారణంగా వ్యాధుల భయం నెలకొంది. స్థానికులు వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

April 18, 2026 / 08:08 AM IST

కాణిపాకం పీఎస్‌పై డీఎస్పీ ఆకస్మిక తనిఖీ

CTR: కాణిపాకం పోలీస్ స్టేషన్‌ను చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ వెంకటనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, పెండింగ్ కేసులను పరిశీలించారు. దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల పర్యవేక్షణ బలోపేతం చేయాలని సూచించారు. అలాగే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

April 18, 2026 / 08:06 AM IST

‘రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలి’

AKP: రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు. మునగపాక మండలం చూచుకొండలో శుక్రవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో రైతులకు పంటల సాగులో శిక్షణ తరగతులు నిర్వహించారు. పచ్చి రొట్ట ఎరువుల సాగుతో భూములు సారవంతం అవుతాయన్నారు.

April 18, 2026 / 08:03 AM IST

రేపు ఏలూరుకి రానున్న ఎంపీ మహేష్

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈ నెల 19న ఏలూరుకి రానున్నట్లు క్యాంపు కార్యాలయ వర్గ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి క్యాంపు కార్యాలయంలో ప్రజలు, నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని అన్నారు. అయితే ఇటీవల ఎంపీ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఆయన తిరిగి ఏలూరుకి రావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

April 18, 2026 / 08:02 AM IST

సీఎం పర్యటనకు భద్రతా ఏర్పాట్ల పరిశీలన

E.G: సీఎం చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహ కిషోర్ శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలను సందర్శించి భద్రతా సూచనలు చేశారు. సీఎం రాకపోకల సమయంలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించారు.

April 18, 2026 / 08:01 AM IST

కడపలో ‘స్టాప్,ఫేస్ వాష్ అండ్ గో’

KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, శుక్రవారం అర్ధరాత్రి దాటాక ప్రయాణించే లారీ, బస్సు, కార్ల డ్రైవర్లను ఆపి, వారి ముఖాలను నీళ్లతో కడిగిస్తున్నారు. నిద్రమత్తును వదిలించుకుని, కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని అప్రమత్తంగా వాహనాలు నడపాలని డ్రైవర్లకు సూచిస్తున్నారు.

April 18, 2026 / 08:00 AM IST

రైతులు దళారీలను ఆశ్రయించొద్దు: తహసీల్దార్

W.G: రైతులు ధాన్యం విక్రయించే సమయంలో దళారీలను ఆశ్రయించవద్దని, రైతు సేవా కేంద్రంలోనే విక్రయించాలని తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్ సూచించారు. శుక్రవారం పెంటపాడు (M) జట్లపాలెం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రక్ షీట్ కోసం ధాన్యం నమూనా 40,600 గ్రాములను RSKలకు తీసుకెళ్లాలన్నారు.

April 18, 2026 / 08:00 AM IST

విశాఖ రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పు

VSP: విశాఖపట్నం నుంచి బయలుదేరే గరీబ్‌రథ్‌, స్వర్ణ జయంతి, షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు చేశారు. జూన్ 18, 19 తేదీల నుంచి ఈ కొత్త సమయాలు అమల్లోకి వస్తాయి. ప్రయాణికులు మార్పులను గమనించాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని రైల్వే అధికారులు కోరారు.

April 18, 2026 / 07:46 AM IST

నేడు జిల్లాలో ‘జలం-జీవం’ కార్యక్రమం

SKLM జిల్లా లో శనివారం ‘స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. ఈ నెల ‘జలం జీవం’ అనే నినాదంతో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారుల ను శుక్రవారం ఆదేశించారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ఉన్న వర్షపు నీటి ఇంకుడు గుంతలను పునరుద్ధరించాలని సూచించారు

April 18, 2026 / 07:44 AM IST

అమలాపురంలో నేడు భారీ జాబ్ మేళా

కోనసీమ: అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు తెలిపారు. ఈ జాబ్ మేళాలకు 15 కంపెనీలు హాజరవ్వగా.. మొత్తం 1300 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల మేరకు 18-30 ఏళ్లు ఉండి, టెన్త్ ఆపై చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

April 18, 2026 / 07:42 AM IST

పలు పోలీస్ స్టేషను పరిధిలో డ్రోన్ సర్వే

PPM: జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాలతో పట్టణంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులు శుక్రవారం డ్రోన్ సర్వే చేశారు. జిల్లాలోని అన్ని పోలీసు స్టేషను ఎస్. హెచ్. ఓ స్థాయి అధికారులతో ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు అరికట్టేందుకు శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని యువతులకు అవగాహన కల్పించారు.

April 18, 2026 / 07:41 AM IST

‘ఎలమంచిలికి కేజీబీని మంజూరు చేయాలి’

AKP: ఎలమంచిలికి కేజీబీవీని మంజూరు చేయాలని ఎంపీపీ రాజాన శేషు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎంపీపీ కార్యాలయాన్ని సందర్శించిన డీఈఓ అప్పారావు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు.

April 18, 2026 / 07:41 AM IST