• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

“ఆపరేషన్ క్లీన్ స్వీప్”లో పాల్గొన్న ఎమ్మెల్యే

BPT: “ఆపరేషన్ క్లీన్ స్వీప్” ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. చీరాల మున్సిపాలిటీ 31వ వార్డులో విస్తృత స్థాయిలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్లీన్ స్వీప్ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీనీ స్వచ్ఛంగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.

May 30, 2026 / 02:52 PM IST

వినుకొండలో ఆపరేషన్ క్లీన్ స్వీప్‌

PLD: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు వారాల ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో భాగంగా పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాలువల శుభ్రపరిచే పనులు, పూడిక తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఇస్మాయిల్, జిల్లా కోఆర్డినేటర్ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

May 30, 2026 / 02:49 PM IST

నూతన శ్లాబ్ కల్వర్టుల నిర్మాణం ప్రారంభం

కృష్ణా: అవనిగడ్డ మండలం మోదుమూడిలో పొలిమేర కోడు, 1/ఏ కాలువలపై రెండు నూతన శ్లాబ్ కల్వర్టుల నిర్మాణం శనివారం ప్రారంభించారు. రూ. 4.82 కోట్లతో మోదుమూడి నుంచి మాచవరం, దక్షిణ చిరువోలులంక మీదుగా కొత్తపేట వరకూ 4.1కిలోమీటర్ల నూతన రహదారి నిర్మించారు. ఈ పనుల్లో భాగంగా కల్వర్టుల నిర్మాణం చేపట్టారు. ఈ పనులను డీసీ వైస్ ఛైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ పరిశీలించారు.

May 30, 2026 / 02:46 PM IST

‘పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి’

ప్రకాశం: పొగాకు రైతులకు కిలోకు రూ. 350 గిట్టుబాటు ధర నిర్ణయించి, దళారీ వ్యవస్థను నిర్మూలించాలని జిల్లా పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇరిగినేని వెంకట నరసయ్య డిమాండ్ చేశారు. శనివారం తూర్పునాయుడుపాలెంలో రైతులతో కలిసి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం అందజేశారు. పొగాకు రైతులు తక్కువ ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

May 30, 2026 / 02:43 PM IST

ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

TPT: తిరుపతి SVCC కాలేజీలో శుక్రవారం జాబ్ మేళాను MLA ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే NDA కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ సువర్ణ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 22 ప్రముఖ MNC కంపెనీలు పాల్గొని, 800 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించాయి. అర్హులైన నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

May 30, 2026 / 02:41 PM IST

కేబుల్ వైర్ల చోరీ.. ఇబ్బందుల్లో రైతులు..!

KDP: మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని గడ్డమారుపల్లెలో రైతులకు చెందిన వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. సుబ్బరాయుడు, వెంకటసుబ్బయ్య, శారద అనే రైతులకు చెందిన పొలాల్లో దొంగలు కేబుల్ వైర్లు కత్తిరించి ఎత్తుకెళ్లిపోయారని బాధిత రైతులు శుక్రవారం వాపోయారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

May 30, 2026 / 02:38 PM IST

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్

CTR: ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పోలీసు అధికారులు శనివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రజల భద్రత, రక్షణే ధ్యేయంగా వీటిని చేపట్టినట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల తనిఖీలు, వాహనాల పరిశీలన, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టినట్టు తెలియజేశారు. నేరాలను ముందస్తుగా పసికట్టేందుకు తనిఖీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.

May 30, 2026 / 02:35 PM IST

కోర్రా గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం

ASR: డుంబ్రిగుడ మండలం కోర్రా గ్రామంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. కింది వీధిలో డ్రైనేజీ లేక కాలువ నీరు నిల్వ ఉంటోందని స్థానికులు తెలిపారు. దీంతో దోమలు విజృంభిస్తున్నాయని పరిసరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడి మురుగు అక్కడే నిలిచి దుర్వాసన వెదజ ల్లుతోందన్నారు. నిల్వ నీటితో వ్యాధులు ప్రబలుతున్నాయని, అధికారులు స్పందించి పారిశుధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు.

May 30, 2026 / 02:35 PM IST

కడియం గ్రామస్థులకు తప్పని తిప్పలు

E.G: కడియం గ్రామ స్మశాన వాటికలో మేకలు, గొర్రెల సంచారం అధికమవడంతో పారిశుద్ధ్యం దెబ్బతిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సమీపంలోని మాంసం దుకాణాల నిర్వాహకులు వాటిని ఇక్కడకు వదలడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. మూగజీవాల విసర్జనల కారణంగా ప్రాంగణమంతా అపరిశుభ్రంగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.

May 30, 2026 / 02:31 PM IST

గంజాయి సమాచారం దాచడం కూడా నేరమే: ఎస్సై

AKP: గంజాయి అమ్మకాలు, రవాణాపై సమాచారం ఉండి కూడా చెప్పకుండా దాచడం నేరమని ఎస్సై రామకృష్ణారావు హెచ్చరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జానకిరాంపురం జీడి కర్మాగారంలో మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి మత్తులో జరిగే నేరాలు, సైబర్ మోసాల బారిన పడకుండా రక్షణ చర్యలను వివరించారు. మహిళలపై జరుగుతున్న ఘోరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

May 30, 2026 / 02:30 PM IST

కలిగిరిలో అదుపుతప్పి కారు బోల్తా

NLR: కలిగిరి మండలం పోలంపాడు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం అదుపుతప్పి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు బయటకు తీసి వైద్యశాలకు తరలించారు. గుంటూరు నుంచి కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

May 30, 2026 / 02:30 PM IST

టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 172 మంది గైర్హాజరు

AKP: జిల్లాలో 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ భౌతికశాస్త్రం పరీక్షలు శనివారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 15కేంద్రాల్లో 1,259 మందికి 1,087 మంది హాజరుకాగా, 172మంది గైర్హాజరయ్యారు. డీఈవో 2 కేంద్రాలను, స్క్వాడ్ బృందాలు 8 కేంద్రాలను తనిఖీ చేశాయి. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు 7కేంద్రాల్లో 377మందికి 295 మంది హాజరయ్యారని DEO అప్పారావు నాయుడు తెలిపారు.

May 30, 2026 / 02:30 PM IST

కాలువ పూడికతీత పనుల ప్రారంభం

GNTR: చేబ్రోలు (మం) పాతరెడ్డిపాలెంలో పంట కాలువ పూడికతీత పనులకు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర శనివారం శంకుస్థాపన చేశారు. రూ.8 లక్షలతో ఈ పనులు చేపట్టారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. కాలువల ఆధునీకరణతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు. రైతుల ఇబ్బందులు తొలగించేలా ఈ పనులను త్వరగా పూర్తి చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

May 30, 2026 / 02:27 PM IST

అనాథ చిన్నారులకు అండగా చదలవాడ దంపతులు

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు దంపతులు మానవత్వం చాటుకున్నారు. అనాథలైన ఇద్దరు చిన్నారులను చేరదీసి వారి విద్యాభ్యాసానికి అండగా నిలుస్తున్నారు. వేసవి సెలవులకు వచ్చిన వెంకట శివరాంను ఇంటికి పిలిచి స్వయంగా భోజనం వడ్డించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దంపతుల సేవా భావంపై ప్రజలు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

May 30, 2026 / 02:23 PM IST

ఉచిత కంప్యూటర్ శిక్షణ ముగింపు కార్యక్రమం

WG: పోటీ ప్రపంచంలో విద్యతోపాటు నైపుణ్యాల అభివృద్ధి కూడా ముఖ్యమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఆకివీడు మండలం దుంపగడప వివి గిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఉచిత కంప్యూటర్ శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని వక్తలు పిలుపునిచ్చారు.

May 30, 2026 / 02:21 PM IST