• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పీచు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలి-అంకంపాలెం రహదారిలో ఉన్న సాయంత్రం కొబ్బరి పీచు ఫ్యాక్టరీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్నికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం లేకపోయినా, సామగ్రి దగ్ధమైంది. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

April 12, 2026 / 05:40 PM IST

బండ్లపల్లి సభకు బయలుదేరిన సీపీఐ నాయకులు

KRNL: ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్దకడబూరు మండలం సీపీఐ నాయకులు బయలుదేరారు. CPI జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలు, రైతులకు అండగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరుస్తుందని ఆరోపించారు.

April 12, 2026 / 05:35 PM IST

విశాఖలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

VSP: విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సీఐ శంకర్ నారాయణ ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ అమలు చేస్తామని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీషీటర్లపై నిత్యం నిఘా ఉంటుందని, నేరవృత్తిని వీడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ నాగమణి, సిబ్బంది ఉన్నారు.

April 12, 2026 / 05:30 PM IST

రేపు యథావిధిగా PGRS : కలెక్టర్

NLR: కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రేపు  ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆదివారం కలెక్టర్  హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్యారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అర్జీ స్థితి లేదా ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 ను సంప్రదించాలని సూచించారు.

April 12, 2026 / 05:30 PM IST

కన్నీటి సంద్రమైన అగ్రహారం..!

KDP: ఖాజీపేటలోని అగ్రహారంలో ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన కీర్తన అంత్యక్రియలు ఆదివారం జరిగాయి. విద్యార్థిని కీర్తనను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నివాళులర్పించారు. అగ్రహారం అంతా కన్నీటి సంద్రమైంది. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమార్తె ఉన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల తల్లిదండ్రులు రోధించారు.

April 12, 2026 / 05:25 PM IST

రొంపిచర్లలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

PLD: రొంపిచర్లను అభివృద్ధి చేసి చూపించామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన రొంపిచర్లలో పర్యటించి మాట్లాడారు.. 2004కు ముందు ఈ ప్రాంతంలో తీవ్ర బాంబుదాడులు జరిగేవని గుర్తుచేశారు. అప్పటి పరిస్థితులు ప్రజల్లో భయాందోళనలు కలిగించాయన్నారు. ‘నేను ఎమ్మెల్యే అయ్యాక శాంతిని నెలకొల్పానని’ చెప్పుకొచ్చారు.

April 12, 2026 / 05:25 PM IST

చేపల మార్కెట్‌లో సమస్యలపై కాంగ్రెస్ ఆందోళన

PPM: పార్వతీపురం మున్సిపల్‌లోని చేపలు, మాంసం మార్కెట్‌లో తాగునీరు, మరుగుదొడ్లు, కరెంట్, శానిటేషన్, రహదారి వంటి మౌలిక సదుపాయాల లేమితో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లేక నష్టాలు వస్తున్నాయని పేర్కొన్నారు. వైసీపీ, కూటమి పాలన వైఫల్యమని, వెంటనే సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

April 12, 2026 / 05:15 PM IST

AITUC జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

KKD: ఏఐటీయూసీ కాకినాడ జిల్లా నూతన కౌన్సిల్ 13 మందితో ఎన్నికైనట్లు ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ తెలిపారు. ఆదివారం కాకినాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఆయన పరిచయం చేశారు. గౌరవ అధ్యక్షులుగా తాటిపాక మధు, అధ్యక్షులుగా కసింకోట కిషోర్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బొబ్బిలి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా తోకల ప్రసాద్ ఎన్నికయ్యారు.

April 12, 2026 / 05:08 PM IST

వివాహ వేడుకలో ఎమ్మెల్యే శ్రావణి సందడి

ATP: శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దంపతులకు శుభాకాంక్షలు తెలిపి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

April 12, 2026 / 05:06 PM IST

పలు అంశాలపై అవగాహన కల్పించిన సీఐ

CTR: శాంతిపురం మండలం టి. కొత్తూరు గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సీఐ శ్రీ మల్లేష్ యాదవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రహదారి భద్రతా నియమాలు, మహిళల భద్రత, నేరాలు, మత్తుపదార్థాల దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలు కలిగి ఉండాలని సీఐ వివరించారు.

April 12, 2026 / 05:00 PM IST

టీడీపీ మండల అధ్యక్షుల ప్రమాణ స్వీకారం

TPT: సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏడు మండలాల అధ్యక్షులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనిపాక లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు.

April 12, 2026 / 05:00 PM IST

రేపు ఈ ప్రాంతాలలో పవర్ కట్

SKLM: ఆమదాలవలస(M) సొట్టవానిపేట సబ్ స్టేషన్ పరిధిలోని 11KV ఫీడర్‌లో విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా సోమవారం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ పైడి యోగేశ్వరరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మెట్టక్కివలస, ఊసవానిపేట, గేదెలవానిపేట తదితర ప్రాంతాల్లో ఉ.9 గంటల నుంచి మ.1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని తెలిపారు. వినియోగదారులు గమనించాలని కోరారు.

April 12, 2026 / 05:00 PM IST

గాయపడిన యువకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KRNL: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న తుగ్గలి మండలం లంకాయపల్లి గ్రామానికి చెందిన హరికృష్ణను పత్తికొండ మాజీ MLA కంగాటి శ్రీదేవమ్మ ఇవాళ పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఆమె వెంట పార్టీ నాయకులు అమర్నాథ్ రెడ్డి, తాండా బాబు నాయక్ తదితరులు ఉన్నారు.

April 12, 2026 / 04:54 PM IST

అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

SS: పెనుకొండ డివిజన్ పరిధిలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళాా శిశు సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోమందేపల్లిలో 49, పెనుకొండలో 16, హిందూపురంలో 36 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు ఈ నెల 20లోపు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

April 12, 2026 / 04:52 PM IST

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్

E.G: గోకవరం (M) రంపయర్రంపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం వేగంగా వచ్చిన ట్రాక్టరు రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న లైన్‌మెన్ వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు.

April 12, 2026 / 04:52 PM IST