విజయనగరం జిల్లాలో ఈ నెల 16 నుండి 22 వరకు గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు పర్యటించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులకు అవసరమైన ఏర్పాట్లపై బాధ్యతలు అప్పగించారు. గవర్నర్ పర్యటన దృష్టిలో ఉంచుకుని భద్రత తదితర సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు.
BPT: అమృతలూరు మండలం ఇంటూరులో పీఎం సూర్యఘర్ ఎస్సీ, ఎస్టీ పథకాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ప్రారంభించారు. ఈ పథకంతో లబ్ధిదారుల ఇళ్లపై 2 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తారు. దీంతో నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ఈ ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. వేమూరు నియోజకవర్గంలో 7,172 మంది దరఖాస్తు చేసుకున్నారు.
CTR: బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
VSP: సింహాచలం దేవస్థానం ద్వారా నిర్వహించబడుతున్న నాదస్వర పాఠశాల విద్యార్థులకు మంగళవారం దేవస్థానం తరపున ప్రత్యేక వితరణ కార్యక్రమం నిర్వహించారు. నాదస్వరం, డోలు అభ్యసిస్తున్న విద్యార్థుల సాధన కోసం సుమారు రూ.లక్ష విలువగల డోలు వాయిద్యానికి అత్యంత కీలకమైన ఆకులు, మూతలు ఈఓ వెంకట్రావు అందజేశారు. ప్రాచీన కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈవో పేర్కొన్నారు.
ప్రకాశం: కనిగిరిలో పీఎం సూర్య ఘర్ పథకం కింద SC, ST కాలనీల సౌరీకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగంతో పేద కుటుంబాలకు విద్యుత్ ఖర్చులు తగ్గి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
GNTR: అమరావతిలో వరద సమస్య పరిష్కారానికి ఏడీసీఎల్ చర్యలు వేగవంతం చేసింది. వరద నివారణ పనుల కోసం తాజాగా బిడ్లు ఆహ్వానించింది. ఇందులో భాగంగా ఉండవల్లి వద్ద భారీ సామర్థ్యం గల పంపింగ్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. రాజధాని ప్రాంతాన్ని తరచూ ముంచెత్తుతున్న వరద ముప్పును అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.
PPM: దేశ పౌరులకు సమాన హక్కు కల్పించిన మహోన్నత వ్యక్తి డా.అంబేడ్కర్ అని కురుపాం MLA తోయక జగదీశ్వరీ అన్నారు. మంగళవారం గుమ్మలక్ష్మీపురం MRO కార్యాలయంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాలలో ఆమె పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రూపొందించి, కుల వివక్ష నిర్మూలనకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు.
కృష్ణా: చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీపీ కోట విజయ రాధిక, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వచ్చాంధ్ర కార్పోరేషన్ డైరెక్టర్ బోలెం నాగమణి, సీనియర్ అసిస్టెంట్ శ్యాంసన్, టైపిస్టు బ్రహ్మానందరావు, సిబ్బంది పాల్గొన్నారు.
బాపట్ల పట్టణంలో నాణ్యమైన తాగునీటి పేరుతో నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతుంది. పట్టణంలో సుమారు 45 వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ చాలా వరకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంట్‌లలో సరైన శుద్ధి ప్రక్రియలు పాటించకుండా ఉప్పు బోరు నీటిని కెమికల్స్ కలిపి తాగునీటిగా మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
NDL: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి గ్రామసభలు ముఖ్యమని తహసీల్దార్, ప్రత్యేక అధికారి పి. రమాదేవి ఇవాళ తెలిపారు. మహానంది స్వర్ణ సచివాలయంలో జరిగిన గ్రామసభలో పాల్గొని, మాట్లాడారు. ముందుగా డా. బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రమాదేవిని పంచాయతీ సెక్రెటరీ భాస్కర్, సిబ్బంది సన్మానించారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.
AP: అంబేద్కర్ ఆశయ సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఎస్.కోట మరియు ఎల్.కోట జంక్షన్ల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
GNTR: తెనాలిలో అగ్నిమాపక కేంద్రంలో మంగళవారం జరిగిన అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభ కార్యక్రమానికి త్రీటౌన్ సీఐ సాంబశివరావు విచ్చేశారు. ఈనెల 14 నుంచి 20 వరకు జరిగే వారోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వేణుగోపాల్, రూరల్ ఎస్సై ఆనంద్‌లతో కలిసి ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు ప్రమాదాలపై పలు జాగ్రత్తలు తెలియజేశారు.
మార్కాపురం: పెద్దారవీడు నూతన ఎస్సైగా సైదుబాబు నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేసిన సాంబశివరావును ఎస్పీ కార్యాలయానికి బదిలీ చేయగా.. కొత్త ఎస్సైగా సైదుబాబు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో సైదుబాబు మార్కాపురం పట్టణ ఎస్సైగా విధులు నిర్వర్తించి, సమర్థవంతమైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
KRNL: అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతీ పౌరుడు కృషి చేయాలని కోసిగి మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ తిక్కన్న, TDP మండల అధ్యక్షుడు మల్లిఖార్జున, TDP జిల్లా ప్రధాన కార్యదర్శి యోసేపు, విజయ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా పెద్దకడబూరులో ఆయన విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఇవాళ యలమంచిలి వాస్తవ్యులు ముదునూరి వెంకట లక్ష్మీపతి రాజు కుటుంబ సభ్యులు రూ.50,116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.