• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నిల్వ నీటితో నరకయాతన

VZM: రామతీర్థం గ్రామంలో మురుగు సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన వీధిలో చేపట్టిన రహదారి పనుల కారణంగా కాలువల్లో మట్టి చేరి నీటి ప్రవాహం ఆగిపోయింది. దీంతో వాడుక నీరు నిల్వ ఉండి దుర్వాసన వ్యాపిస్తోంది. దోమల పెరుగుదలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

April 4, 2026 / 09:21 AM IST

డోన్ పాఠశాలలో తేనెటీగల తట్టు తొలగింపు

NDL: డోన్ బాలికల ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో తేనెటీగల సమస్యపై శుక్రవారం అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టారు. పాఠశాల ప్రాంగణంలో తేనెటీగల తట్టును గుర్తించి ప్రత్యేక పద్ధతులతో జాగ్రత్తగా తొలగించారు. ఈ సమయంలో విద్యార్థులు, సిబ్బందికి ఎటువంటి ప్రమాదం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

April 4, 2026 / 09:20 AM IST

రెండు కార్లు ఢీ.. ముగ్గురికి గాయాలు

KDP: దువ్వూరు మండల పరిధిలోని కడప – కర్నూలు జాతీయ రహదారిలో పెద్ద జొన్నవరం మెట్ట సమీపం నందు శుక్రవారం సాయంత్రం రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయాలు పాలైన వారిని స్థానికులు 108 వాహనం సాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ఏర్పాట్లు చేపట్టారు.

April 4, 2026 / 09:15 AM IST

మంత్రి ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ

ELR: ఉభయ సభల్లో అమరావతి రాజధానికి ఆమోదం పొందడం పట్ల రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఆగిరిపల్లి మండలంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అలాగే ‘మన రాజధాని మన అమరావతి’ అంటూ జై అమరావతి జై జై అమరావతి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

April 4, 2026 / 09:15 AM IST

ఆలూరుకు తుంగభద్ర నీటి విడుదల

KRNL: ఆలూరు నియోజకవర్గ తాగునీటి అవసరాల కోసం తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువకు 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు పవర్ కాలువ ద్వారా గుండ్లకెరె చెరువుకు చేరి LLCకి మళ్లిస్తున్నారు. మూడు రోజుల్లో 250 కి.మీ పరిధికి చేరనుంది. విడుదల 15 రోజులు కొనసాగి ఈ నెల 18 లేదా 20వ తేదీకి నిలిపివేయాలని అధికారులు పేర్కొన్నారు.

April 4, 2026 / 09:10 AM IST

ఈ నెల 23 నుంచి గంధం మహోత్సవం

TPT: దొరవారిసత్రం మండలంలో నెలబల్లిలో హజ్రత్ హుసేనమ్మ దర్గలో 56వ గంధ మహోత్సవం ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనుందని దర్గా కమిటీ వెల్లడించింది. 23న (గురువారం) రాత్రి గంధ మహోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి, 24న(శుక్రవారం)రాత్రి పాటకచేరి, 25న(శనివారం) రాత్రి జబర్దస్త్ టీంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారని వారు తెలిపారు.

April 4, 2026 / 09:10 AM IST

PHCల గ్రేడింగ్‌లో పులిచెర్లకు మొదటి స్థానం

చిత్తూరు జిల్లాలోని 42 PHCలలో పులిచెర్ల PHC మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలో A గ్రేడ్ ఏదీ లేకపోగా, కేవలం 3 PHCలు మాత్రమే B గ్రేడ్ సాధించాయి. 23 PHCలు C, 15 D, ఒకటి E గ్రేడ్ పొందాయి. ఫిబ్రవరిలో పులిచెర్లలో 2693 OP, 41 IP, 3376 ల్యాబ్ పరీక్షలు జరగగా, చివరి స్థానంలోని ఆరుమాకులపల్లిలో 504 OP, 132 పరీక్షలు మాత్రమే నమోదయ్యాయి.

April 4, 2026 / 09:05 AM IST

ఉండి పోలీసుల హెచ్చరిక

W.G: ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైనది కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉండి పోలీసులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది ఇళ్ల బయట, మేడపైన, ఆవరణలో నిద్రిస్తుంటారు. దీన్ని ఆసరాగా తీసుకుని రాత్రి వేళల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందన్నారు. బంగారం, నగదు, సెల్ ఫోన్‌లు, ఇతర విలువైన వస్తువులను బయట, తలగడ పక్కన ఉంచకూడదన్నారు.

April 4, 2026 / 09:02 AM IST

నేడు రాజమండ్రిలో జాబ్ మేళా

E.G: రాజమండ్రి కలెక్టరేట్ వద్ద గల వికాస కార్యాలయంలో శనివారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఉదయం 9:30గంటలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

April 4, 2026 / 09:00 AM IST

ప్రభుత్వ స్థలాలను అమ్మేస్తున్నారు!

NLR: అనంతసాగరం ఎంపీడీవో కార్యాలయం సమీపంలో రెండేళ్ల క్రితం సుమారు 300 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. అందులో కొందరు ఇళ్లు నిర్మించుకోగా చాలా మంది ప్లాటును రూ. 3 నుంచి రూ.5 లక్షలకు అమ్ముకుంటున్నారు. సమీపంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వాటిని కూడా అమ్మేస్తున్నారు. వీటిపై దృష్టి సారించాలని శుక్రవారం స్థానికులు అధికారులను కోరుతున్నారు.

April 4, 2026 / 09:00 AM IST

25న ఫుట్‌ బాల్ అసోసియేషన్ ఎన్నికలు

కడపలోని జయరాజ్ ఫంక్షన్ హాలులో ఈ నెల 25న ఉదయం 10 గంటలకు జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. సుధీర్ తెలిపారు. రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ ఆదేశానుసారం జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక జరపనున్నామన్నారు. సభ్యులందరూ ఈ ఎన్నికల్లో పాల్గొనాలని ఆయన కోరారు.

April 4, 2026 / 08:36 AM IST

ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

E.G: కొవ్వూరు టీడీపీ కార్యాలయంలో ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను తెలియజేస్తూ సుమారు 17 వినతి పత్రాలను అందజేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా విని, తక్షణ పరిష్కార దిశగా సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు.

April 4, 2026 / 08:35 AM IST

పరిసరాలను శుభ్రం చేసిన కలెక్టర్

కృష్ణా: మచిలీపట్నంలో కలెక్టర్ బాలాజీ పరిసరాలను శుక్రవారం శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మచిలీపట్నం నగరాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల రహితంగా, శుభ్రంగా, పచ్చదనంతో నింపిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

April 4, 2026 / 08:31 AM IST

నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు

KKD: జిల్లాలో శనివారం నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు మొదలుకానున్నాయి. మొత్తం 227 కొనుగోలు కేంద్రాలను నిర్వ హించనున్నారు. రబీలో 6లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా కాగా, 3లక్షల టన్నులు పౌరసరఫరాల సంస్థ ద్వారా సేకరణ లక్ష్యంగా చేసుకున్నారు. అవసరమైతే మరింత ధాన్యాన్ని కొనడానికి కార్యాచరణ రూపొందించారు.

April 4, 2026 / 08:30 AM IST

రాజధాని గ్రామాల్లో 4జీ సేవలు ప్రారంభం

GNTR: రాజధాని అమరావతి పరిధిలోని వైకుంఠపురం, అనంతవరం గ్రామాల్లో 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. బీఎస్ఎన్ఎల్ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్థానికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. 4జీ సిమ్ కోసం సమీప కస్టమర్ సర్వీస్ సెంటర్లు, తుళ్లూరు టెలిఫోన్ ఎక్స్‌చేంజ్‌ను సంప్రదించవచ్చని సంస్థ తెలిపింది. దీంతో డిజిటల్ సేవలు మెరుగుపడనున్నాయి.

April 4, 2026 / 08:30 AM IST