• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘దళితుల సమస్యలు పరిష్కరించండి’

SKLM: మందస మండల దళితుల సమస్యలు పరిష్కరించాలని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ప్రతినిధులు రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాంకు వినతిపత్రం అందజేశారు. కొంకడాపుట్టి గ్రామంలో దళిత మహిళ భూమి ఆక్రమణ, లోహరిబందలో దళితులకు కేటాయించిన భూముల ఆక్రమణలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

May 30, 2026 / 03:25 PM IST

పలువురు పోలీసులకు ఎస్పీ సన్మానం

KRNL: సుధీర్ఘకాలం పోలీసుశాఖలో పని చేసి పదవి వీరమణ పొందడం అభినందనీయమని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వారి సేవలను అభినందిస్తూ.. శాలువ, పూలమాలతో సత్కరించి, బహుమతులను అందజేశారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని, పదవివీరమణ పొందిన తర్వాత ఏమైనా సమస్యలుంటే నేరుగా ఎస్పీని సంప్రదించవచ్చని చెప్పుకొచ్చారు.

May 30, 2026 / 03:23 PM IST

పరీక్షలకు హాజరైన విద్యార్థులు

PLD: అమరావతి మండలంలో ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పరీక్ష రాసేందుకు 145 మంది విద్యార్థులు శనివారం హాజరయ్యారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రత అధికంగా ఉండడంతో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు ఇబ్బందులకు గురయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వివిధ వాహనాల ద్వారా జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షా కేంద్రానికి విద్యార్థులు వచ్చారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు.

May 30, 2026 / 03:23 PM IST

చీరాలలో లలితా కళా సమితి వార్షికోత్సవాలు

BPT: చీరాలలో లలిత కళాసమితి 74వ వార్షికోత్సవాన్ని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. కళల అభివృద్ధికి సమితి అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా సభ్యులను అందె మురళీవర ప్రసాద్, జూనియర్ డీ.వీ. సుబ్బారావు, కళాకారిణి అమృతవర్షిణిలను సత్కరించారు.

May 30, 2026 / 03:22 PM IST

మస్టర్ ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించిన ఎంపీడీవో

NTR: కంచికచర్ల(M)కొత్తపేట గ్రామంలో మాస్టర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని ఎంపీడీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామంలోని పలు కుటుంబాల వివరాలను అధికారులు పరిశీలించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమాచారాన్ని ధృవీకరించారు. ఇంటింటికీ వెళ్లి ఆధార్, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర రికార్డులను పరిశీలించారు.

May 30, 2026 / 03:18 PM IST

ఘనంగా శ్రీ సోమేశ్వర స్వామి అలంకరణ కార్యక్రమం

W.G.రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ ప్రముఖ పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి వారికి వరి కంకెలతో విశేష అలంకరణ చేశారు. క్షేత్ర ప్రధాన అర్చకులు చెరుకూరి రామకృష్ణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ఈ ప్రత్యేక పూజలు, అలంకరణలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.

May 30, 2026 / 03:12 PM IST

‘అఖిలభారత ప్రశ్నావళిలో ఆదివాసీలను గుర్తించండి’

NDL: డోన్ పట్టణంలోని ఈరోజు పోస్ట్ ఆఫీస్ నందు గిరిజనులకు విద్యా, వైద్యం, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సక్రమంగా అమలు చేయాలని గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి మోటా రాముడు డిమాండ్ చేశారు. ప్రతి గిరిజన కుటుంబానికి రెండు సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించాలన్నారు. ఏపీ గిరిజన సమాఖ్య పోస్టు కార్డు ఉద్యమం ద్వారా ఈ రోజు రాష్ట్రపతికి 100 పోస్ట్ కార్డులు పంపించారు.

May 30, 2026 / 03:11 PM IST

జగ్గయ్యపేటలో రక్షిత త్రాగునీటి ప్లాంట్‌లు ప్రారంభం

NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో రక్షిత త్రాగునీటి ప్లాంట్‌ను అల్ట్రాటెక్ సిమెంట్స్ సంస్థ (సీఎస్ఆర్) నిధుల ద్వారా రూ. 5.75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించారు. దీనిని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య శనివారం ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ రక్షిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

May 30, 2026 / 03:11 PM IST

వేరుశనగ కాయల నమోదు ప్రారంభం : AO

KDP: వేముల మండలంలో రైతులకు 40% సబ్సిడీపై వేరుశనగ కాయల పంపిణీ కోసం నమోదు ప్రక్రియ శనివారం ప్రారంభించినట్లు ఏవో ఓబులేసు తెలిపారు. మండలానికి 260 క్వింటాళ్ల వేరుశనగ కాయలు మంజూరయ్యాయన్నారు. క్వింటాల్ ధర రూ.10,200 కాగా, రూ. 4,080 సబ్సిడీ లభించడంతో రైతులు రూ. 6,120 చెల్లించాలన్నారు. వేరుశనగ సాగు చేసే రైతులు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలన్నారు.

May 30, 2026 / 03:11 PM IST

కూటమిలో మాజీ కార్పొరేటర్ వ్యాఖ్యలపై చర్చ

విశాఖలో జనసేన మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇటీవల కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలు, అధికారులపై చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. శనివారం విడుదలైన రాజకీయ విశ్లేషణల్లో, ఇటువంటి ఆరోపణలు ప్రజల్లో కూటమి పాలనపై సందేహాలకు దారితీసే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

May 30, 2026 / 03:03 PM IST

RTC టికెట్ రేట్లు పెంచే ఆలోచన లేదు: మంత్రి

అన్నమయ్య: ఆర్టీసీ ప్రైవేటీకరణ, డీజిల్ ధరల కారణంగా టికెట్ రేట్లు పెరుగుతాయనే వార్తలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఖండించారు. RTC ఆర్థికంగా బలంగా ఉందని,సంస్థకు రూ. 25-30 వేల కోట్ల ఆస్తులున్నాయని తెలిపారు. టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ప్రైవేటీకరణ కూడా జరగదని స్పష్టం చేశారు. త్వరలోనే 2,500 ఈవీ, 500 CNG బస్సులు రానున్నాయని మంత్రి వెల్లడించారు.

May 30, 2026 / 03:02 PM IST

జిల్లాలో మరో ఐదు రోజులు భానుడి భగభగ

పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ సూచనల ప్రకారం జిల్లాలోని 15 మండలాలు హీట్ ఇండెక్స్ డేంజర్ కేటగిరీ (41°C నుంచి 54°C) పరిధిలో ఉండనున్నట్లు తెలిపారు.

May 30, 2026 / 03:02 PM IST

‘పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలి’

సత్యసాయి: జిల్లాలో పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కోరారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో నిర్వహించిన సర్వపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్పెషల్ ఇంటెన్సి రివిజన్ (SIR-2026)లో భాగంగా జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని చెప్పారు.

May 30, 2026 / 03:02 PM IST

జడ్పీ ఛైర్మన్‌తో చిత్తూరు జడ్పీ ఛైర్మన్ భేటీ

విజయనగరం జిల్లా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును చిత్తూరు జిల్లా జడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై పరస్పరం చర్చించుకున్నారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరినొకరు శాలువాతో సత్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

May 30, 2026 / 03:01 PM IST

ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సన్మానం

అనకాపల్లి జిల్లా పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి పదవీ విరమణ పొందిన ఏఎస్సైలు బీ.రామ్‌కుమార్, వీ.త్రినాథ్‌రావు, ఏఆర్ హెచ్‌సీ ఎల్.గోవిందరావులకు శనివారం ఘన వీడ్కోలు పలికారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో సేవలందించిన వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహనరావు పాల్గొన్నారు.

May 30, 2026 / 03:01 PM IST