• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన ఎంపీ

SKLM: ఎచ్చెర్ల మండలం జరజాం పంచాయతీలో టీడీపీ కార్యకర్త జరుగుల్ల లక్ష్మణరావు భార్య అన్నపూర్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడింది. ఆమెకు సీఎంఆర్ఎఫ్ కింద రూ.1,28,000 చెక్కును ఆదివారం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి వైద్య ఖర్చులకు సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

April 12, 2026 / 03:00 PM IST

‘వైసీపీ ఊసరవెల్లి ఆరోపణలు ప్రజలు నమ్మరు’

VZM: మాజీ సీఎం జగన్‌పై గతంలో బొత్స, ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలను గుర్తు చేస్తూ ఆదివారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎంపీ కలిశెట్టి అప్పలనాయడు, ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు చేస్తున్న ఊసరవెల్లి ఆరోపణలను ప్రజలు నమ్మరని, అందుకే ప్రజలకు మరోసారి గుర్తు చేస్తిన్నామన్నారు.

April 12, 2026 / 03:00 PM IST

విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల

మార్కాపురంలోని కొండేపల్లి రోడ్డులో శ్రీ పట్టాభిరామస్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవం భక్తుల నడుమ ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కందుల నారాయణరెడ్డి తన సతీమణి వసంతమ్మతో కలిసి పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమాలు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించారు.

April 12, 2026 / 02:56 PM IST

రేపల్లెలో CMRF చెక్కుల పంపిణీ

BPT: రేపల్లెలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం అండగా నిలిచింది. మంత్రి అనగాని సత్యప్రసాద్ చొరవతో 33 మందికి CMRF మంజూరైంది. మంజూరైన మొత్తం రూ.32,82,393 చెక్కులను స్థానిక టీడీపీ నేతలు లబ్ధిదారులకు ఆదివారం అందజేశారు. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి, మంత్రికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

April 12, 2026 / 02:42 PM IST

విడపనకల్లప్ప స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

ATP: విడపనకల్‌లో కురుబల ఆరాధ్యదైవం విడపనకల్లప్ప స్వామి గుడికట్ల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, భక్తులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. సాంప్రదాయ ఉత్సవాలు భక్తిభావంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.

April 12, 2026 / 02:40 PM IST

ఉగాది పురస్కార గ్రహీత రమణమూర్తికి సత్కారం

NDL: ఇటీవల ప్రభుత్వంచే ఉగాది పురస్కారం అందుకున్న నంద్యాలకు చెందిన సాహితీవేత్త వైష్ణవ వెంకటరమణ మూర్తిని కళారాధన సాంస్కృతిక సంస్థ కార్యాలయంలో కళారాదన, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. రమణమూర్తి అనేక వాక్యాలు రచించడమే కాకుండా పద్య సాహిత్య ప్రచురియానికి చేసిన సేవలు విశిష్టమైనవని ప్రశంసించారు.

April 12, 2026 / 02:32 PM IST

మల్లాపల్లిలో రేపు ఉషశ్రీ చరణ్ పర్యటన

SS: జిల్లా వైసీపీ అధ్యక్షురాలు కేవీ ఉషశ్రీ చరణ్ సోమవారం గోరంట్ల మండలంలోని మల్లాపల్లి పంచాయతీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటనను జయప్రదం చేయాలని మండల కన్వీనర్ పగడాల వెంకటేష్, టౌన్ కన్వీనర్ మేదర శంకర పిలుపునిచ్చారు.

April 12, 2026 / 02:31 PM IST

గ్రామ దేవత మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

SKLM: పోలాకి మండలం కోరాడ లచ్చయ్య పేట గ్రామం శ్రీ శ్రీ శ్రీ గ్రామదేవత అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఆదివారం గ్రామస్థుల ఆహ్వానంతో ఎమ్మెల్యే రమణమూర్తి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు ఉన్నారు.

April 12, 2026 / 02:30 PM IST

గంజాయిపై గ్రామస్తులకు అవగాహన

VZM: ఎస్.కోట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవరంలో గంజాయి కట్టడిపై సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో గ్రామస్తులకు ఆదివారం అవగాహన కల్పించారు. గ్రామాల్లో అక్రమంగా గంజాయి రవాణా చేసినా, విక్రయించిన, సేవించిన చట్టరీత్య నేరం అని తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

April 12, 2026 / 02:30 PM IST

విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి

ELR: ముసునూరు మండలం చింతలవల్లి గ్రామంలో ఆదివారం రూ. 4.02 కోట్లతో 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణానికి గృహనిర్మాణ మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపడుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు.

April 12, 2026 / 02:28 PM IST

రామవరప్పాడులో జోరుగా క్రికెట్ బెట్టింగ్

NTR: రామవరప్పాడులో అక్రమ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఐపీఎల్ సీజన్ కావడంతో ఇరువురు వ్యాపారస్తులు బెట్టింగ్ రాకెట్లను నిర్వహిస్తూ భారీగా నగదు లావాదేవీలు జరుపుతున్నట్లు సమాచారం. వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యక్తులు, తెర వెనుక బెట్టింగ్ వ్యవహారాలను నడిపిస్తూ.. యువతను ఆకర్షిస్తున్నారని స్థానికులు  ఆరోపిస్తున్నారు. 

April 12, 2026 / 02:24 PM IST

డెంటల్ ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే

KRNL: ఆదోనిలో డెంటల్ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో దంత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు మెరుగైన వైద్య సేవలలో కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

April 12, 2026 / 02:24 PM IST

రేపు పాడా కార్యాలయంలో PGRS కార్యక్రమం

KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ‘PGRS’ నిర్వహించనున్నట్లు పీడీ శివరాం ప్రసాద్ ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బాధితుల నుంచి అర్జీలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. రాలేని వారు ఆన్‌లైన్‌లో విన్నవించుకోవచ్చన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

April 12, 2026 / 02:17 PM IST

అమల్లోకి ఆధునిక టోల్ విధానం

కృష్ణా: జిల్లాలో ఆధునిక టోల్ విధానం అమల్లోకి వచ్చింది. వెదురుపావులూరు సమీపంలోని NHపై ఉన్న టోల్ ప్లాజాను పూర్తిగా క్యాష్‌లెస్, బూత్‌లెస్ విధానంగా మార్చారు. ఏప్రిల్ 10 నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఇకపై వాహనదారులు ఫాస్టాగ్ ద్వారానే చెల్లింపులు చేయాలి. బ్యాలెన్స్ లేకుంటే టోల్ వద్దే డిజిటల్ చెల్లింపు చేసి, అదనంగా 25 శాతం రుసుము చెల్లించాలి.

April 12, 2026 / 02:15 PM IST

సంఘం నేతలు ఎమ్మెల్యే ఆహ్వానం.!

BPT: ఈ నెల 19న బాపట్లలో ఏపీ మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి ఆవిర్భావ వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి రావాలని కోరుతూ.. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజుకు సంఘ నేతలు ఆహ్వాన పత్రికను అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు ఆదివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

April 12, 2026 / 02:15 PM IST