• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయండి’

W.G: MLA ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం అమరావతిలోని సచివాలయంలో CM చంద్రబాబుని కలిశారు. తణుకు నియోజకవర్గంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకు వివరించారు. నియోజకవర్గంలోని మున్సిపల్ రహదారులు, భవనాల నిర్మాణం, పెండింగ్లో ఉన్న ఇతర పనులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

April 10, 2026 / 08:29 PM IST

వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకం పొడిగింపు

అన్నమయ్య: వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం పొడిగిస్తూ జీవోఎంఎస్ 43 జారీ చేసింది. ఈ పథకం ద్వారా అక్రిడిటెడ్, ఫ్రీలాన్స్, వేటరన్ జర్నలిస్టులు మరియు వారి కుటుంబాలకు క్యాష్‌లెస్ వైద్యం కొనసాగుతుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సమాచార అధికారి తెలిపారు.

April 10, 2026 / 08:28 PM IST

సీతంలో పోలిసెట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

VZM: సీతం కళాశాలలో ఏప్రిల్ 4 నుంచి నిర్వహిస్తున్న ఉచిత పోలిసెట్ శిక్షణ కార్యక్రమంలో భాగంగా.. ఇవాళ విద్యార్థులకు పోలిసెట్‌కు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ బొత్స అనూష హాజరయ్యారు. సంస్థ అందిస్తున్న ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

April 10, 2026 / 08:14 PM IST

ఘనంగా ఏకలవ్య సంఘం వార్షికోత్సవం

W.G: అత్తిలి మండలం పాలూరులో ఏకలవ్య సంఘం 12వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంఘానికి చెందిన 12 మంది విద్యార్థులకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు గ్రామ సహకార సంఘం మాజీ అధ్యక్షుడు అల్లూరి రామకృష్ణంరాజు తెలిపారు. ఈ విద్యార్థుల్లో పదో తరగతి నుండి ఎంబీఏ చదివే విద్యార్థులు ఉన్నారని తెలిపారు.

April 10, 2026 / 08:11 PM IST

‘చారిత్రక సమస్యలకు శాశ్వత పరిష్కారం’

SKLM: జిల్లాలో చారిత్రక సమస్యలకు శాశ్వత పరిష్కారం తమ హయాంలో పరిష్కారం అవుతునందుకు ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇవాళ జిల్లాలోని మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కానీ నేరేడు బ్యారేజ్ సమస్యను పరిష్కరించామని, జులై 5న భోగాపురం ప్రారంభోత్సవానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

April 10, 2026 / 08:08 PM IST

ఏపీఎస్ఆర్టీసీ సిబ్బందికి ఆరోగ్య అవగాహన శిక్షణ

VSP: ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు ఆధ్వర్యంలో సిబ్బందికి ఇవాళ మద్దిలపాలెం డిపోలో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బందికి వైద్య బృందాలు శిక్షణ ఇచ్చాయి. ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ అందించి 108 ద్వారా చికిత్సకు తరలించాలని తెలిపారు.

April 10, 2026 / 08:06 PM IST

ట్రాక్టర్ నగర్‌లో కలెక్టర్ పర్యటన

ATP: గార్లదిన్నె మండలంలోని దక్షిణ ప్రాంత వ్యవసాయ యంత్రాల శిక్షణ, పరీక్షణ సంస్థను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సంస్థలోని డ్రోన్ ప్రయోగశాల, టెస్టింగ్ ల్యాబ్‌లు, అత్యాధునిక వ్యవసాయ పరికరాలను ఆయన పరిశీలించారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన శిక్షణార్థులు, స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

April 10, 2026 / 08:03 PM IST

జలధార పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

SS: జలధార-జలహారతి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని చెరువులు, కాలువలను త్వరితగతిన బాగు చేయాలన్నారు. మొబైల్ యాప్ వినియోగిస్తూ ప్రతి చెరువులోకి నీరు చేరేలా చూడాలన్నారు.

April 10, 2026 / 08:00 PM IST

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి’

E.G: కడియం మండలం జేగురుపాడు RBK కేంద్రంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి గాను 24 గంటల్లోపే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నదన్నారు.

April 10, 2026 / 08:00 PM IST

మార్కాపురం కలెక్టర్‌ను కలిసిన ఉపాధ్యాయులు

మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతను తన ఛాంబర్‌లో శుక్రవారం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 14న డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వారి జీవిత చరిత్రను ఆధారం చేసుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశామని, బహుమతుల ప్రధానోత్సవాన్ని హాజరుకావాలని కలెక్టర్‌ను కోరారు.

April 10, 2026 / 07:57 PM IST

నరసరావుపేటలో CMRF చెక్కులు పంపిణీ

PLD: నరసరావుపేటలో శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తన కార్యాలయంలో CMRF చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం రూ.12 లక్షల విలువ గల చెక్కులను 25 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.

April 10, 2026 / 07:51 PM IST

మే లేదా జూన్‌లో సీఎం పర్యటించే అవకాశం: కలెక్టర్

VZM: రీసర్వే పూర్తైన గ్రామాల్లో రికార్డులు సరిదిద్ది తప్పులు లేని పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఇవాళ జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మే లేదా జూన్‌లో సీఎం పాల్గొనే కార్యక్రమంలో పాస్ పుస్తకాలు పంపిణీ చేసే అవకాశం ఉందన్నారు.

April 10, 2026 / 07:51 PM IST

‘చిన్నపిల్లల ఆరోగ్యం, పోషణపై శ్రద్ధ చూపాలి’

కృష్ణా: గుడ్లవల్లేరు మండలంలో నిర్వహిస్తున్న పోషణ పక్వాడ కార్యక్రమంలో ఎంపీడీవో ఇమ్రాన్ పాల్గొన్నారు. గర్భిణీలు, బాలింతలు చిన్నపిల్లల ఆరోగ్యం, పోషణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎమ్‌లు సమన్వయంతో పని చేసి ప్రతి లబ్ధిదారునికి సేవలు అందించాలని తెలిపారు.

April 10, 2026 / 07:50 PM IST

ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్

PLD: వినుకొండలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తన కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వివరించగా, ఆయన స్వయంగా వినతి పత్రాలను స్వీకరించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల సమస్యలపై పలువురు ఫిర్యాదులు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తామని అన్నారు.

April 10, 2026 / 07:43 PM IST

పవర్లిఫ్టింగ్‌లో KVIK అకాడమీ ఘన విజయం

GNTR: రాజాం వేదికగా జరిగిన 13వ ఏపీ పవర్లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో KVIK అకాడమీ క్రీడాకారులు మెరిశారు. ఈ పోటీల్లో 4 బంగారు, 3 వెండి, 1 కాంస్య పతకాలను షానూన్, లిఖిత, వినయశ్రీ, కౌశిక్ గోల్డ్ సాధించారు. బౌషిక్ ఆచార్య 73 కేజీల విభాగంలో గోల్డ్‌తో పాటు స్ట్రాంగ్ టైటిల్ అందుకున్నారు.

April 10, 2026 / 07:42 PM IST