• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

రేపు సామాజిక తనిఖీ ఓపెన్ ఫారం: ఎంపీడీవో

KDP: వేముల మండలంలో 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పనులపై గురువారం సమావేశం జరగనుందని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో శివారెడ్డి తెలిపారు. 19వ విడత సామాజిక తనిఖీ బహిరంగ సభ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో జరగనుందన్నారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, సంభందిత అధికారులు, గ్రామీణ శ్రామికులు తప్పక హాజరుకావాలని ఎంపీడీవో కోరారు.

April 29, 2026 / 02:29 PM IST

గూడూరులో విలేకరి హత్యపై నిరసన..!

KRNL: చిత్తూరు జిల్లా పి.కోట మండలానికి చెందిన విలేకరి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ APవర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నాయకులు ఇవాళ గూడూరులో నిరసన చేపట్టారు. హత్యకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం MRO వెంకటేష్‌కు వినతిపత్రం అందజేశారు. శ్రీ గంధం మాఫియాపై వార్తలు రాసినందుకే ఈ హత్య జరిగినట్లు తెలిపారు.

April 29, 2026 / 02:22 PM IST

రేపు సింగరాయకొండలో క్రికెట్ టోర్నమెంట్

ప్రకాశం: సింగరాయకొండ జూనియర్ కాలేజీలో గురువారం కల్లకుంట గోపి మెమోరియల్ కార్క్ బాల్ క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్టు కమిటీ నిర్వాహకులు బుధవారం తెలిపారు. మొదటి ప్రైజ్‌గా రూ.50,000, రెండవ బహుమతిగా రూ.30 వేలు, మూడో ప్రైజ్ రూ.20,000గా ఇవ్వనున్నట్లు తెలిపారు. టీంలో 11 మంది సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, ఎవరు కిట్టు వాళ్లే తెచ్చుకోవాలని నిర్వాహణ కమిటీ తెలిపారు.

April 29, 2026 / 02:15 PM IST

విశాఖలో చిత్రలేఖన శిబిరం నిర్వహణ

VSP: కేంద్ర గ్రంథాలయం ద్వారకానగర్లో బుధవారం చిత్రలేఖన అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పాల్గొన్నారు. వేసవి విజ్ఞాన శిబిరాల భాగంగా బాలబాలికలకు చిత్రలేఖనంపై మార్గదర్శనం ఇచ్చారు. కథలతో పాటు సృజనాత్మకత పెంపొందించుకోవాలని సూచించారు.

April 29, 2026 / 02:15 PM IST

‘AI వినియోగంలో జాగ్రత్తలు పాటించండి’

TPT: శక్తి టీమ్ మహిళా పోలీసులు బుధవారం కాలేజీ విద్యార్ధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీనేజ్ సమస్యలు, సైబర్ నేరాలు, POCSO చట్టంపై విద్యార్థులకు వివరించారు. సోషల్ మీడియా మోసాలు, లోన్ యాప్‌లు, AI వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శక్తి యాప్ ఉపయోగాలు, అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్లు 181, 1930, 112 గురించి అవగాహన కల్పించారు.

April 29, 2026 / 02:14 PM IST

ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న తహసీల్దార్

GNTR: తెనాలి జగ్గడిగుంటపాలెం శివారు చినరావూరులో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న 61 సెంట్ల ప్రభుత్వ భూమిని MRO గోపాలకృష్ణ బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమిత స్థలం వద్దకు వెళ్ళిన ఆయన రైతు రత్తయ్యతో మాట్లాడి భూమిని స్వాధీన పరుచుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం 5 కోట్ల విలువైన ఈ భూమి కొద్ది సంవత్సరాలుగా ఆక్రమణకు గురైందని చెప్పారు.

April 29, 2026 / 02:14 PM IST

అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

NTR: కంచికచర్లలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు భావన థియేటర్స్ సెంటర్ వద్ద మంగళవారం ఈ సేవ ప్రారంభమైంది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఏ.శివారెడ్డి ప్రారంభించి, బాటసారులు, ఆటో డ్రైవర్లు, ప్రయాణికులకు మజ్జిగ, చల్లని నీరు అందిస్తున్నామని తెలిపారు.

April 29, 2026 / 02:12 PM IST

‘ప్రతీ సమస్యకు కచ్చితమైన పరిష్కారం చూపుతాం’

PPM: సమస్యతో వచ్చే ప్రతీ అర్జీదారుని సంతృప్తే ముఖ్యమని, ప్రతీ సమస్యకు కచ్చితమైన పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవిన్యూ సమస్యలపై అసంతృప్తి అర్జీదారులతో కలెక్టర్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి, స్పందన, పీజీఆర్‌ఎస్ వేదికల ద్వారా అందిన వినతులపై ఆరా తీశారు.

April 29, 2026 / 02:12 PM IST

‘సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనవాణి’

AKP: ఎలమంచిలి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 98 అర్జీలను అందజేశారు. వాటిలో ముఖ్యంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్ కోసం ఎక్కువ అర్జీలు వచ్చాయి.

April 29, 2026 / 02:12 PM IST

‘తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి’

VZM: గజపతినగరం మండలం జిన్నాం పంచాయతీలో పనిచేస్తున్న నలుగురు గ్రీన్ అంబాసిడర్లను అకారణంగా తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద CITU ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని కార్మికులు ఆరోపించారు. అనంతరం ఎంపీడీవోకు వినతి పత్రాన్ని అందజేశారు.

April 29, 2026 / 02:12 PM IST

‘జిల్లాలో 46,936 మందికి పింఛన్లు’

పోలవరం: జిల్లాలోని 46,936 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ప్రభుత్వం రూ.19.61 కోట్లు విడుదల చేసిందని డీఆర్డీఏ పీడీ రత్నాకర్ బుధవారం తెలిపారు. రాజవొమ్మంగి మండలానికి అత్యధికంగా రూ. 2.5 కోట్లు మంజూరయ్యాయి. మే 1న లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, లబ్ధిదారులందరూ అందుబాటులో ఉండాలని ఆయన కోరారు.

April 29, 2026 / 02:11 PM IST

గుడి కండ్రిగ గంగ జాతరలో ఎమ్మెల్యే దర్శనం

CTR: నగరి రూరల్ మండలం గుడి కండ్రిగలో ఘనంగా గంగ జాతర మహోత్సవం నిర్వహించారు. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగ జాతర సజావుగా నిర్వహించేందుకు కృషి చేసిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

April 29, 2026 / 02:09 PM IST

రేపు నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు

TPT: బాలాయపల్లి (M) కనుమరాయ కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో గురువారం నరసింహ స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలియజేశారు. ఉదయం 5 గంటలకు అభిషేకం అనంతరం కళ్యాణోత్సవం, రాత్రి పల్లకిసేవ, సాంస్కృతిక కార్యక్రమాలు మ్యూజికల్ ఆర్కెస్ట్రా జరుగుతాయని అన్నారు.

April 29, 2026 / 02:07 PM IST

నీట్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష

CTR: జిల్లాలో మే 3న నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌వో కే. మోహన్ కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల సన్నద్ధత, భద్రత, మౌలిక సదుపాయాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియో విజువల్స్ విడుదల చేశారు.

April 29, 2026 / 02:02 PM IST

సద్దుమణిగిన ఇంధన కొరత సమస్య

PLD: ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా పెట్రోల్, డీజిల్ సరఫరా జరగడంతో జిల్లాలో ఇంధన కొరత సమస్య సద్దుమణిగింది. పెట్రోల్ బంకుల వద్ద రద్దీ గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలోని పెట్రోల్ బంక్‌ను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఈ ఉదయం తనిఖీ చేసి సరఫరా పరిస్థితులను పరిశీలించారు.

April 29, 2026 / 01:56 PM IST