• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టాలి’

VSP: అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విశాఖలోని డాబాగార్డెన్స్ సర్కిల్‌ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజానికి మార్గదర్శకులైన అంబేద్కర్ ఆలోచనలను, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్, వంశీ కృష్ణ యాదవ్ పాల్గొన్నారు.

April 14, 2026 / 03:14 PM IST

కలెక్టరేట్ల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలు

ELR: అణగారిన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన దార్శనికుడు డా.బీ.ఆర్ అంబేద్కర్ అని జేసీ అభిషేక్ గౌడ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ల్‌లో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ప్రజలందరూ స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవిస్తున్నారంటే అంబేద్కర్ రాజ్యంగంలో మనందరికీ కల్పించిన హక్కులేనని జేసీ అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:11 PM IST

అంబేద్కర్‌కు మాజీ ఎమ్మెల్యే నివాళులు

VZM: డెంకాడ మండలం దొడ్డి బాడువ గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 03:11 PM IST

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి: ఎమ్మెల్యే

TPT: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరైయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, తదితర నాయకులు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:01 PM IST

ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

అన్నమయ్య: మదనపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. కలెక్టర్ నిశాంత్, ఎమ్మెల్యే షాజహాన్ తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆలోచనలు సమాజంలోని ప్రతి వర్గానికి మార్గదర్శకమని కలెక్టర్ పేర్కొన్నారు. పీఎం అజయ్ పథకం కింద 25 మంది లబ్ధిదారులకు రూ.27 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.

April 14, 2026 / 03:01 PM IST

తాడిపర్రులో ‘జై భీమ్- జై భీమ్’ నినాదాలు

E.G: BR అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. మంగళవారం బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ ప్రజలతో కలిసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ రూపకర్త, విద్యా స్ఫూర్తి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ‘జై భీమ్- జై భీమ్’ అంటూ నినాదాలు చేశారు.

April 14, 2026 / 03:00 PM IST

‘విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలి’

KKD: సామర్లకోట మండలం హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన ముప్పిడ ప్రణీత నేషనల్ స్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగనాద్ ప్రణీతను పూలమాలతో సత్కరించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, ప్రభుత్వ సహాయం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

April 14, 2026 / 03:00 PM IST

అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

నెల్లూరు 33వ డివిజన్లో రూ.35 లక్షలతో నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కమ్యూనిటీ హాల్‌ను మంగళవారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రూరల్ నియోజకవర్గంలో ప్రతి వార్డు, గ్రామాలలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 14, 2026 / 03:00 PM IST

గుంతకల్లులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

ATP: గుంతకల్లులో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి దేహాన్ని ఆసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు అతిగా మద్యం సేవించి మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమాన వ్యక్తం చేస్తున్నారు.

April 14, 2026 / 03:00 PM IST

నూతన అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

కృష్ణా: ఉంగుటూరు మండలం ఆత్కూరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అంబేద్కర్ విగ్రహాన్ని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆవిష్కరించి నివాళులర్పించారు. మహిళా హక్కుల కోసం అంబేద్కర్ మంత్రి పదవినే త్యాగం చేశారని పేర్కొన్నారు. ఆయన పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని అసెంబ్లీలో కోరతానన్నారు.

April 14, 2026 / 02:52 PM IST

జీలుగుమిల్లిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

ELR: జీలుగుమిల్లిలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన కృషి చేశారని చెప్పుకొచ్చారు.

April 14, 2026 / 02:51 PM IST

తెనాలి తహసీల్దార్‌కు బిరుదు ప్రధానం..!

GNTR: తెనాలిలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం ఐతానగర్‌లో బీఎస్‌ఏ యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్‌ను సదరు యూత్ “మనసున్న మండల తహసీల్దార్” బిరుదులతో ఘనంగా సత్కరించారు.

April 14, 2026 / 02:49 PM IST

అగ్నిమాపక వారోత్సవాలలో రక్తదానం

W.G: తణుకు పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. తణుకు ఇంఛార్జ్ ఫైర్ ఆఫీసర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 14 నుంచి 20 వరకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది రక్తదానం చేశారు. రక్తదానం చేసిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అధికారులు అందజేశారు.

April 14, 2026 / 02:45 PM IST

సచివాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

NLR: జలదంకిలోని చోడవరం సచివాలయంలో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, కార్యదర్శి నాగరాజు పూలమాలలు వేసి నివాళర్పించారు. ఆయన అనగారిన వర్గాలకు ఆశాజ్యోతి అని కొనియాడారు. పేదల పట్ల పెన్నిధిగా ప్రతి ఒక్కరి ఆశయాలు, హక్కులను కాపాడేలా రాజ్యంగాన్ని నిర్మించిన మహనీయుల సేవలు ఎప్పటికీ మర్చిపోలేమన్నారు.

April 14, 2026 / 02:45 PM IST

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: మంత్రి

కోనసీమ: రామచంద్రపురం మండలంలో మంగళవారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కకర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

April 14, 2026 / 02:44 PM IST