• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే విద్యార్థులు అద్భుతాలు చేస్తారు’

VZM: గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప‌ట్టుద‌ల‌తో చ‌దివితే అద్భుతాలు సాధిస్తార‌ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్ర‌శంసించారు. ఇంట‌ర్ ఫ‌లితాల్లో జిల్లాలోని పెద‌మేడ‌పల్లి గ్రామానికి చెందిన రెడ్డి తేజ‌స్విని 1000కు 991 మార్కుల‌తో జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఈ సందర్బంగా మంత్రి ఆమెను అభినందించి సన్మానించారు.

April 18, 2026 / 09:13 PM IST

ఇండియా కూటమి నాయకుల దిష్టిబొమ్మ దహనం

SKLM: కేంద్రంలోని NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇండియా కూటమి అడ్డు కోవడాన్ని నిరసిస్తూ శనివారం శ్రీకాకుళం లోని 7 రోడ్ల కూడలి వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు తేజేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇండియా కూటమి నాయకుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమికి అడ్రస్ లేకుండా చేయడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

April 18, 2026 / 09:10 PM IST

చంద్రబాబు, జగన్, పవన్ ముగ్గురూ ద్రోహులే

కోనసీమ: దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గించాలని మోడీ పన్నిన కుట్రలో భాగమైన CM చంద్రబాబు ,Dy.CM కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ CM జగన్ ఈ ముగ్గురు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నవారేనని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ కామన ప్రభాకరరావు ఆరోపించారు. మండపేటలో ఇవాళ కామన మాట్లాడుతూ.. మహిళా బిల్లును అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను దెబ్బతీయాలని మోడీ ఆలోచించారన్నారు.

April 18, 2026 / 09:09 PM IST

శాస్త్రవేత్తలతో ఎమ్మెల్యే పల్లె సింధూర భేటీ

సత్యసాయి: కేరళలో పర్యటిస్తున్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కొచ్చిన్‌లోని అమృత సెంటర్ ఫర్ నానోసైన్సెస్ అండ్ మాలిక్యులర్ మెడిసిన్ శాస్త్రవేత్తలతో భేటీ అయ్యారు. డాక్టర్ శాంతికుమార్ నాయర్, డాక్టర్ జయకుమార్ రంగసామి సహా పలువురు నిపుణులతో ఆమె చర్చలు జరిపారు. అక్కడే ఉన్నత చదువులు పూర్తి చేసిన ఎమ్మెల్యే.. పాత పరిచయాలను గుర్తుచేసుకున్నారు.

April 18, 2026 / 09:06 PM IST

ప్రజల నుండి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

TPT: తిరుపతిలో శనివారం జనవాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనవాణి ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జనవాణి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి నెలా మొదటి శనివారం, మూడవ శనివారం జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

April 18, 2026 / 08:45 PM IST

పెదబయలులో పర్యటించిన జిల్లా కలెక్టర్

ASR: పెదబయలు మండలంలోని దూలపల్లి, పరదేశిపుట్టు గ్రామాల్లో శనివారం కలెక్టర్ టీ. నిశాంతి పర్యటించారు. ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ లేదని తెలుసుకొని, అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. అలాగే పరదేశిపుట్టు గ్రామంలో పాఠశాల భవనం, బ్రిడ్జి నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు చేశామన్నారు.

April 18, 2026 / 08:41 PM IST

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం: RTC వైస్ ఛైర్మన్

CTR: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం (M) కంగుందిలో TDP నేతలు ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే మనము ఆరోగ్యంగా ఉంటామని విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని మునిరత్నం సూచించారు.

April 18, 2026 / 08:41 PM IST

జొన్నాడ గోదావరిలో “భోగి” సినిమా సందడి

కోనసీమ: యాక్షన్ థ్రిల్లర్ సినిమా డైరెక్టర్‌గా ప్రసిద్ధికెక్కిన సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిస్తున్న “భోగి” సినిమా షూటింగ్ ఆలమూరు మండలం జొన్నాడ-రావులపాలెం గోదావరి మధ్యలో చిత్రీకరిస్తున్నారు. కేవలం రాత్రి సమయంలోనే భారీ విద్యుత్తు వెలుగుల మధ్య ఈ షూటింగ్ జరుపుతున్నారు. ఇసుకు తిన్నెలపై హీరో శర్వానంద్ తో ఓ భయానక ఫైటింగ్ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.

April 18, 2026 / 08:38 PM IST

వెలుగు యానిమేటర్లకు మొబైల్ ఫోన్ల పంపిణీ

సత్యసాయి:పెనుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి సవిత నియోజకవర్గంలోని వెలుగు సంఘాల యానిమేటర్లకు 231 మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, సమాచార మార్పిడి వేగవంతం చేసేందుకు ఈ చర్య దోహదపడుతుందని మంత్రి తెలిపారు.

April 18, 2026 / 08:35 PM IST

రోడ్డు పక్కన చెత్తలో మంటలు

GNTR: తెనాలి నందులపేటలో రోడ్డు పక్కన చెత్తకుప్పలో మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు వన్ టౌన్, టూ టౌన్ సీఐలు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీనివల్ల పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆకతాయిల అల్లరి పనుల వల్లే జరిగిందని అధికారులు నిర్ధారించారు. 

April 18, 2026 / 08:31 PM IST

చెరువుల పునరుద్ధరణకు వేగం: ఎమ్మెల్యే

PLD: రొంపిచర్ల మండలం తుంగపాడు గ్రామంలో “స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా చెరువుల ప్రక్షాళన, పునరుద్ధరణ పనులపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు హాజరయ్యారు. గ్రామంలోని చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే, శుభ్రత మరియు పునరుద్ధరణ పనులు నిర్లక్ష్యం లేకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

April 18, 2026 / 08:31 PM IST

దేశాభివృద్ధికి జనగణన-2027 కీలకం

KRNL: జనగణన-2027 దేశ అభివృద్ధికి కీలకమని ఇవాళ ఆదోని మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ ఆదూరి విజయ్ కృష్ణ తెలిపారు. ప్రజలు నిజమైన వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలుకు సహకరించాలని కోరారు. జనగణన రెండు దశల్లో నిర్వహించి ఇంటింటికి వివరాలు సేకరిస్తారని చెప్పారు. ప్రతి కుటుంబం బాధ్యతగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

April 18, 2026 / 08:30 PM IST

పాఠశాలలో ఎమ్మెల్యే ఆకస్మిక తనీఖీ

NTR: చందర్లపాడు మండలం ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల పరిసరాలు, తరగతులను పరిశీలించి విద్యార్థినుల ప్రతిభను పరీక్షించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థినులను సన్మానించారు. క్యాంటీన్‌లో భోజనం పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమని సూచించారు.

April 18, 2026 / 08:29 PM IST

సీసీ రోడ్లు, డ్రైన్ల‌కు మంత్రి శంకుస్థాప‌న‌

VZM: జామి మండ‌లంలోని ఎంకె. వ‌ల‌స గ్రామంలో శ‌నివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప‌లు కార్యక్ర‌మాల్లో పాల్గొన్నారు. గ్రామంలో రూ. 74 ల‌క్ష‌లతో నిర్మించే సీసీ ర‌హ‌దారులు, డ్రైన్ల ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం చేశారు. మండ‌లంలో 12 గ్రామాల‌కు ఎన్ఆర్‌జీఎస్ ద్వారా రు. 23 కోట్ల నిధులు విడుద‌ల‌య్యాయ‌ని మంత్రి క‌ర...

April 18, 2026 / 08:28 PM IST

ప్రకృతి కార్యాశాలతో పర్యావరణ అవగాహన

VSP: ప్రకృతి కార్యాశాలల ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీవో వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. సెయింట్ ఆన్స్ ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 400 మంది ఎన్‌సీసీ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విత్తనాల బంతులు తయారీ, మొక్కలు నాటడం, పశుపక్ష్యాదులకు నీరు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

April 18, 2026 / 08:26 PM IST