• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

స్పోర్ట్స్ హాస్టల్ తరలింపుపై వివాదం

కర్నూలులోని శాయి స్పోర్ట్స్ హాస్టల్‌ను తిరుపతికి తరలించాలనే యత్నాలపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి భరత్ స్పందించాలని డిమాండ్ చేశారు. కర్నూలును స్పోర్ట్స్ సిటీగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం హాస్టల్ పరిరక్షణపై తీసుకున్న చర్యలు వెల్లడించాలని కోరారు.

April 15, 2026 / 06:40 PM IST

లోకేష్ నియామకంపై మంగళగిరిలో టీడీపీ సంబరాలు

GNTR: మంత్రి లోకేష్‌ను TDP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంపై మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పొలిట్‌బ్యూరో, జాతీయ-రాష్ట్ర కమిటీలలో లోకేష్‌కు కీలక బాధ్యతలు దక్కడంతో మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్‌లో నాయకులు స్వీట్లు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు.

April 15, 2026 / 06:36 PM IST

భట్టిప్రోలులో అన్న క్యాంటీన్ ప్రారంభం

BPT: పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని బాపట్ల కలెక్టర్ డా. వినోద్ కుమార్, ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. భట్టిప్రోలులో కొత్తగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను వారు బుధవారం ప్రారంభించారు. రూ.61 లక్షలతో ఆధునిక వసతులతో దీనిని నిర్మించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ పేదలు, కూలీలకు రోజూ నాణ్యమైన భోజనం అందించనున్నారు.

April 15, 2026 / 06:35 PM IST

చందనోత్సవ ఏర్పాట్లపై తుది సమీక్ష

VSP: సింహాచలం చందనోత్సవంపై తుది సమీక్ష బుధవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ మేరకు కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను అంకితభావంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ ఉత్సవాన్ని 12 సెక్టార్లుగా విభజించి, సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సుమారు 2 లక్షల మంది భక్తులు రానున్న నేపథ్యంలో క్యూలైన్‌లు, పార్కింగ్, పారిశుద్ధ్యం, తాగునీరు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని చెప్పారు.

April 15, 2026 / 06:32 PM IST

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన కాకినాడ విద్యార్థులు

KKD: కాకినాడ పీ.ఆర్ ప్రభుత్వ వృతి విద్యా కళాశాల విద్యార్థులు బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ గ్రూపుకు చెందిన రెండోవ సంవత్సరం విద్యార్థిని బి.రూప ఆశ్రిత 992/1000, మొదటి సంవత్సరం ఎలక్ట్రానిక్స్ చదువుతున్న ఎస్. హర్షిత 488/500 మార్కులు సాధించారు.

April 15, 2026 / 06:32 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

PLD: అమరావతి ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా సీఎం భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్‌లోనే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే భాష్యం పాల్గొన్నారు.

April 15, 2026 / 06:32 PM IST

ఇంటర్ సెకండ్ ఇయర్లో టౌన్ ఫస్ట్‌గా శరణ్య

కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో గుడివాడ పట్టణానికి చెందిన నారాయణ జూనియర్ కాలేజీ విద్యార్థి ఆకునూరి శ్యామ్ శరణ్య ఇవాళ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మొత్తం 1000 మార్కులకు గాను 992 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్‌గా నిలిచింది. శరణ్య సాధించిన ఈ విజయంపై కాలేజీ యాజమాన్యం, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.

April 15, 2026 / 06:26 PM IST

‘పీజీఆర్ఎస్ అర్జీలను వేగవంతంగా పరిష్కరించండి’

KRNL: పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి రిజిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో పీజీఆర్ఎస్, రెవెన్యూ జనరేషన్, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిత్యం ఉదయం పీజీఆర్ఎస్ లాగిన్‌లో వచ్చిన అర్జీలను చూడాలన్నారు.

April 15, 2026 / 06:20 PM IST

‘మారుతున్న నేరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంచాలి’

విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఇవాళ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా అధికారులు నైపుణ్యాలు పెంచుకుని సాంకేతికతను వినియోగించాలని సూచించారు. గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పాల్గొన్నారు.

April 15, 2026 / 06:20 PM IST

రాజమండ్రిలో అగ్నిమాపక అవగాహన కార్యక్రమం

E.G: రాజమండ్రిలోని రైల్వే స్టేషన్, బస్ గ్యారేజ్, బస్ కాంప్లెక్స్‌లలో సహాయ అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం అగ్నిమాపక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్, ఆయిల్ తదితర అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. విపత్తుల నుంచి సురక్షితంగా బయటపడే విధానాలను ప్రత్యక్ష ప్రదర్శనలు చేశారు.

April 15, 2026 / 06:20 PM IST

ఏఎన్ఎం మెరిట్ జాబితా విడుదల

ATP: అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టు భర్తీకి సంబంధించి ప్రొవిజనల్ జనరల్ మెరిట్ జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రిన్సిపల్ డా.విజయశ్రీ తెలిపారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ధ్రువపత్రాలతో ఏప్రిల్ 18లోపు సమర్పించాలని సూచించారు.

April 15, 2026 / 06:20 PM IST

సచివాలయాల పనితీరుపై కలెక్టర్ సమీక్ష

సత్యసాయి: కలెక్టరేట్‌లో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతిరోజూ సచివాలయాలను సందర్శించి పాలనను పర్యవేక్షించాలని ఆదేశించారు. ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఉద్యోగి రోజుకు కనీసం 5- 20 సేవలు అందించాలని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు.

April 15, 2026 / 06:20 PM IST

‘పోషకాహార లోపం లేని భారత దేశమే లక్ష్యం’

TPT: పిచ్చటూరు(మం) వేలూరు గ్రామంలో పోషణ్ పఖ్వాడా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ మేరకు పోషకాహారం యొక్క ప్రాముఖ్యత, తల్లి, శిశు ఆరోగ్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అసోసియేట్ జె. రామకృష్ణ, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

April 15, 2026 / 06:12 PM IST

అన్న క్యాంటీన్ ప్రారంభం

ASR: రంపచోడవరంలో బుధవారం అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేదలకు తక్కువ ధరలో భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. కేవలం రూ.5కే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కార్మికులు, విద్యార్థులు, పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

April 15, 2026 / 06:11 PM IST

‘అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలి’

AKP: రాజకీయాలకతీతంగా అభివృద్ధిపైనే ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు. ఈ మేరకు సబ్బవరంలో ప్రత్యేక అధికారులు, నాయకులు, ప్రజలతో సమన్వయ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వేసవి నేపథ్యంలో తాగు, సాగునీటికి ఇబ్బందులు రాకుండా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.

April 15, 2026 / 06:11 PM IST