• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

యంగన్నపల్లిలో ఉపాధి హామీ పనుల తనిఖీ

ATP: గుత్తి మండలం యంగన్నపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను ఇవాళ ఎంపీడీవో ప్రభాకర్ నాయక్ తనిఖీ చేశారు. అనంతరం ఉపాధి హామీ కూలీల హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలకు ఫేస్ యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ యాప్ ద్వారా గ్రామాల్లో ఉపాధి హామీ పనులలో అవినీతిని అరికట్టవచ్చన్నారు.

April 10, 2026 / 02:40 PM IST

జాతరకు అదనపు బస్సుల ఏర్పాటు కోసం వినతి

KRNL: గూడూరు పట్టణంలో ఈనెల 13న జరిగే శ్రీ తిమ్మగురుడు స్వామి జాతర నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సు సర్వీసులు నడపాలని APSRTC కర్నూలు రీజనల్ మేనేజర్‌కు, గూడూరు పట్టణ అధ్యక్షులు కె. రామాంజనేయులు, సింగిల్ విండో డైరెక్టర్ రేమాట వెంకటేష్ ఇవాళ వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ఉన్న సర్వీసులకు అదనంగా కొత్త బస్సులను ఏర్పాటు చేయాలన్నారు.

April 10, 2026 / 02:33 PM IST

ఏబీఎన్ రాధాకృష్ణపై అమలాపురం పోలీసులకు ఫిర్యాదు

కోనసీమ: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలాపురం వైసీపీ ఇంఛార్జి పినిపే శ్రీకాంత్ నేతృత్వంలో పట్టణ పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేసి, చట్టపరంగా శిక్షించాలని కోరారు.

April 10, 2026 / 02:30 PM IST

జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

PLD: మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా ఏపీ ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు బుల్ల రాజారావు పిలుపు మేరకు శుక్రవారం క్రోసూరులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర హానర్బల్ ఛైర్మన్ సేవరత్న గార్లపాటి దాసు జ్యోతిరావు పూలే గురించి మాట్లాడారు.

April 10, 2026 / 02:28 PM IST

బిగ్ బాస్ విజేత కళ్యాణ్‌కు సత్కారం

VSP: బిగ్ బాస్ సీజన్-9 విజేత కళ్యాణ్ పడాల ఇవాళ నగరంలో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు నివాసంలో కళ్యాణ్‌ను ఘనంగా సత్కరించి, శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపికను అందజేశారు. బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన గుర్తింపుకు ప్రజల ఆదరాభిమానాలే కారణమని కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.

April 10, 2026 / 02:25 PM IST

సర్వసిద్ధి రమణ మాస్టారు విగ్రహ ఆవిష్కరణ

VZM: బొబ్బిలి, గొల్లపల్లి గ్రామానికి చెందిన స్వర్గీయ సర్వసిద్ధి రమణ మాస్టారు విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) ఇవాళ బొబ్బిలిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రమణ మాస్టారు ఒక గొప్ప సామాజిక కార్యకర్తగా గొల్లపల్లి గ్రామానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.

April 10, 2026 / 02:21 PM IST

బారాషహీద్ దర్గాలో ముఖద్వారాల ప్రారంభం

నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రూ.2.30 కోట్లతో ముఖ ద్వారాలు నిర్మించారు. వీటిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వర్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ కలిసి ఇవాళ ప్రారంభించారు. అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో దర్గాలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తన హయాంలోనే దర్గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.

April 10, 2026 / 02:20 PM IST

అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలి: ASP

ATP: పెద్దపప్పూరు పోలీస్ స్టేషన్‌ను తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఇవాళ తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు గురించి సీఐ రామసుబ్బయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నేరాల సమీక్ష నిర్వహించి గంజాయి కట్టడి, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై దిశానిర్దేశం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.

April 10, 2026 / 02:20 PM IST

బలుసులమ్మ అమ్మవారి అన్నదాన నిధికి విరాళం

W.G: తాడేపల్లిగూడెం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపుతో శ్రీ బలుసులమ్మ అమ్మవారి శాశ్వత అన్నదానం కార్యక్రమానికి రూ. 9 లక్షలు ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజికి, మారి శెట్టి పోతురాజు అందజేశారు. ఈ కార్యక్రమంలో సింహపురి జ్యువెలరీ మహేష్, చవ్వకుల రమణ నాయకులు పాల్గొన్నారు.

April 10, 2026 / 02:17 PM IST

మదనపల్లె విలేఖర్ కన్నుమూత

అన్నమయ్య: మదనపల్లెకు చెందిన విలేఖర్ గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను చికిత్స కోసం స్థానిక మోడ్రన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కన్నుమూశారు. గంగాధర్ మృతి పట్ల శుక్రవారం పాత్రికేయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మృతదేహాన్ని దేవళం వీధిలోని స్వగృహానికి తరలించారు.

April 10, 2026 / 02:16 PM IST

‘పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం’

KRNL: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. CM సహాయనిధి నుంచి మంజూరైన సుమారు రూ. 60 వేల విలువైన చెక్కులను ఇవాళ ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పంచలింగాలలోని తన నివాసంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఎంపీ మాట్లాడుతూ.. అనారోగ్యం, కష్టాల్లో ఉన్న పేదలకు ఈ నిధి కొండంత అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

April 10, 2026 / 02:13 PM IST

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై

KKD: కిర్లంపూడి మండలం జగపతినగరంలో ఉపాధి హామీ కూలీలకు స్థానిక ఎస్సై జి. సతీష్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు శ్రద్ధ వహించాలని, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత లింకులు, కాల్స్‌కు స్పందించవద్దని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

April 10, 2026 / 02:10 PM IST

వ్యవసాయ సాంకేతిక సమాచార కేంద్రం భవనం ప్రారంభం

బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ సాంకేతిక సమాచార కేంద్రం నూతన భవనాన్ని ఆచార్య ఎన్.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. ఆర్. శారద జయలక్ష్మి దేవి ప్రారంభించారు. భవనంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాలు, ఛాయాచిత్రాలు, విద్యార్థులు రూపొందించిన నమూనాలు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై స్పష్టమైన అవగాహన కల్పిస్తాయని తెలిపారు.

April 10, 2026 / 02:09 PM IST

కదిరిలో ఎమ్మెల్యే కందికుంట ప్రజా దర్బార్

SS: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పట్టణంలోని 9, 10 వార్డుల్లో ప్రజా దర్బార్ నిర్వహించారు. మశానంపేట మున్సిపల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

April 10, 2026 / 02:03 PM IST

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై సదస్సు

ATP: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల ఆవశ్యకతపై అనంతపురంలో వైసీపీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు ఇవాళ జరిగింది. జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాముఖ్యత, హంద్రీనీవా ప్రధాన కాలువ వెడల్పు వల్ల కలిగే ప్రయోజనాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

April 10, 2026 / 02:03 PM IST