AKP: గొలుగొండ మండలం సీ.హెచ్. నాగాపురం గ్రామంలో గంగాదేవి తల్లి పండగను మంగళవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేసి సౌకర్యాలు కల్పించారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఉత్సవ వాతావరణం నెలకొంది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో విపత్తులు, అగ్నిమాపక దళ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహనా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి గుండా ర్యాలీ నిర్వహించి, కరపత్రాలు పంపిణీ చేశారు. వేసవిలో అగ్నిప్రమాదల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఫైర్ ఆఫీసర్ టి. శ్రీనివాస రావు వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
VSP: డా,బి.ఆర్.అంబేద్కర్ 135వ, జయంతి సందర్భంగా డెంకాడ పోలీసు స్టేషన్ పరిధిలోని పాలెం గ్రామంలో భోగాపురం గ్రామీణ సీఐ జీ.రామకృష్ణ, ఎస్సై సన్యాసినాయుడు మంగళవారం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్‌కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపు లో పాల్గొన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడవాలని కోరారు.
సత్యసాయి: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సుమారు రూ.25 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రేషన్ విలువ తగ్గించి ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని ఆయన ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు.
కడప జిల్లాలో నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా పోలీసులు నైట్ పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు రాత్రివేళ అప్రమత్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు. లాక్డ్ హౌస్‌ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దొంగతనాలను అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు.
PPM: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్వతీపురంలో అంబేద్కర్ విగ్రహానికి మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక సంస్కర్తగా, న్యాయవేత్తగా విశిష్ట స్థానాన్ని సంపాదించారని తెలిపారు.
KRNL: రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 29న ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ గుప్తా హాజరుకానున్నారు.
E.G: రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం-సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ప్రకాశం: భారతదేశంలో సామాజిక సమతుల్యత హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ అని మంత్రి స్వామి అన్నారు. తూర్పు నాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు.
W.G: అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు
AKP: అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్ అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నర్సీపట్నం పెద్దచెరువు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో సమానత్వం, స్వేచ్ఛ కోసం అంబేడ్కర్ చేసిన సేవలు అపారమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
SKLM: అరసవిల్లిలోని ఆదిత్యుడిని మినిస్ట్రీ అఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఆశిష్ కుమార్ గుప్త మంగళవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ, ఆలయం కార్యనిర్వాహణాధికారి కే. ఎన్. వి. డి. వి. ప్రసాద్ సాదరంగా ఆహ్వానించి స్వామివారి దర్శనం చేయించి, ఆలయ చరిత్రను చెప్పారు.
KRNL: కర్నూలు నగరంలో అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా విభేదాలు భగ్గుమన్నాయి. కొండారెడ్డి బ్రిడ్జి వద్ద జేసీ నూరల్ కమర్ సమక్షంలో జరిగిన సభలో అధికారులు, వెల్ఫేర్ సంఘం నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ఉత్సవాలు నిర్వహిస్తూ, తమను ఆహ్వానించకపోవడంపై ఏపీ షెడ్యూల్ కులాల వెల్ఫేర్ సంఘం నేతలు అధికారులను నిలదీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NDL: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఇవాళ డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి బేతంచర్ల మండలం రేపల్లె గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ సమానత్వం, సామాజిక న్యాయానికి చేసిన సేవలు అపారమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
TPT: పెళ్లకూరు మండలం రోసనూరు గ్రామంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే నియోజకవర్గ ఇంఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.