• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జిల్లాలో కేంద్ర స‌మాచార క‌మిష‌న‌ర్ పర్యటన

VSP: కేంద్ర సమాచార కమిషనర్(సీఐసీ) సధారాణి రేలంగి ఈ నెల 6, 7 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆరో తేదీన ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. అనంతరం ఏడో తేదీ ఉదయం 10 గంటల నుంచి దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో జరిగే దక్షిణ ప్రాంత లా రివ్యూ కన్సల్టేషన్ ప్రారంభం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

April 4, 2026 / 08:10 PM IST

స్వామిని దర్శించుకున్న హరేకృష్ణ మఠ పీఠాధిపతులు

TPT: మాయాపూర్ హరే రామ హరే కృష్ణ ఆలయ రెండవ పీఠాధిపతి జననీవాస్ మహరాజ్, తిరుపతి హరే రామ హరే కృష్ణ ఆలయ పీఠాధిపతి నీలా పారాయణ ప్రభు నాగలాపురం వేదనారాయణ స్వామిని శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఆలయ ప్రాధాన్యంపై ప్రశంసలు వ్యక్తం చేశారు.

April 4, 2026 / 08:03 PM IST

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

W.G: పెనుమంట్ర మండలం మాముడూరులో ఇవాళ జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ బొక్క దుర్గాప్రసాద్‌ (27) మృతి చెందారు. సత్తెమ్మ తల్లి ఆలయ సమీపంలోని రొయ్యల చెరువు వద్ద మట్టి పనుల కోసం వెళ్లిన ట్రాక్టర్‌ను రివర్స్‌ తీస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మరణించారు. 

April 4, 2026 / 08:00 PM IST

స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు

NDL: నంద్యాల పట్టణం తెలుగుపేటలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయ అర్చకులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, తిరుమంజనం నిర్వహించారు. స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

April 4, 2026 / 08:00 PM IST

పెనుకొండలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

సత్యసాయి: పెనుకొండలో మంత్రి సవిత శనివారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సోమందేపల్లి మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన చాకలి తిప్పన్నకు రూ.55,000, పందిపర్తి గ్రామానికి చెందిన ఉప్పర వసంత కుమారికి రూ.66,750 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముందస్తు సహాయంగా అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఆదుకుంటామన్నారు.

April 4, 2026 / 08:00 PM IST

వాల్వ బస్సు ఢీకొన్న ఘటనలో మృతుడి వివరాలు

NTR: నందిగామ మండలం ఐతవరం నేషనల్ హైవే 65పై శనివారం తెల్లవారుజామున వాల్వ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతుడు చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన స్వామిగా పోలీసులు గుర్తించారు. రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి వోల్వా బస్సు వేగంగా ఢీకొట్టడంతో అక్కడకక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

April 4, 2026 / 08:00 PM IST

సూరేపల్లి సచివాలయంలో కలెక్టర్ తనిఖీ

BPT: భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి రికార్డులను పరిశీలించారు. సచివాలయ సిబ్బంది పనితీరుపై సమీక్ష నిర్వహించారు. సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన సూచించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యతగా పని చేయాలన్నారు.

April 4, 2026 / 08:00 PM IST

బస్టాండ్ బాగోగులు గాలికొదిలిన ప్రభుత్వం

అన్నమయ్య: చిట్వేలి ఆర్టీసీ బస్టాండ్ చెత్త, ముళ్లకంపలు, దుర్వాసనతో దారుణ స్థితికి చేరింది. వాష్‌రూమ్‌లు పనికిరాక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్లతో నిర్మించిన ఈ సదుపాయం నిర్లక్ష్యానికి బలైందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి శుభ్రత, సౌకర్యాలు పునరుద్ధరించకపోతే ప్రజా ఆగ్రహం ఉధృతమయ్యే ప్రమాదం ఉందన్నారు.

April 4, 2026 / 08:00 PM IST

డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన మీర్జా బాషా

కృష్ణా: నందివాడ మండలం పుట్టగుంట గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా నియమితులైన డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారి అమీర్ మీర్జా భాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. గ్రామ అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని డిప్యూటీ ఎంపీడీవో తెలిపారు. పలువురు అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేశారు.

April 4, 2026 / 08:00 PM IST

కూటమిపై బొత్స విమర్శలు

VSP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అమరావతికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, దాని పేరుతో జరుగుతున్న దోపిడికే వ్యతిరేకమని స్పష్టం చేశారు.

April 4, 2026 / 07:52 PM IST

గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు

VSP: సింహాచలం గోశాలలో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శబల భోజనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంతో గర్భవతులకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ పండుగలో కులాకార్ బియ్యం పంపిణీ చేశారు. చేతివృత్తులు, వెదురు ఇల్లు ఆకట్టుకోగా, ప్లాస్టిక్ రహిత ఏర్పాట్లు ప్రత్యేకంగా నిలిచాయి. సహజ పదార్థాలతో తయారుచేసిన పానీయాలు, విత్తనాలు, ప్రకృతి ఉత్పత్తులు అందుబాటులో ఉంచారు.

April 4, 2026 / 07:35 PM IST

సచివాలయాలను తనిఖీ చేసిన డిప్యూటీ ఎంపీడీవో

KRNL: సి.బెళగల్ మండల పరిధిలోని పోలకల్ గ్రామంలోని మూడు సచివాలయాలను గ్రామ వార్డు పర్యవేక్షణ అధికారి డిప్యూటీ ఎంపీడీవో షాషావలి తనిఖీ చేశారు. ఇవాళ ఆయన సచివాలయాల్లో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వే యొక్క వివరాలపై ఆరా తీశారు. యుఎఫ్ఎస్ సర్వేలో నమోదు కానీ సభ్యుల వివరాలను గుర్తించి త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని తెలిపారు.

April 4, 2026 / 07:30 PM IST

వేంపల్లె తహసీల్దార్‌గా మోహన్ కృష్ణ

KDP: వేంపల్లె మండల తహసీల్దార్‌గా పి. మోహన్ కృష్ణ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నందలూరులో డిప్యూటీ తహసీ‌ల్దార్‌గా పనిచేసిన ఆయన, పదోన్నతిపై వేంపల్లెకు బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. మండల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

April 4, 2026 / 07:30 PM IST

మొబైల్ దొంగతనాల గ్యాంగ్ అరెస్ట్

NDL: బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామ సమీపంలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, చరణ్ అనే నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

April 4, 2026 / 07:30 PM IST

నకిలీ ఏసీబీ అధికారి అరెస్ట్

సత్యసాయి: ఏసీబీ అధికారిగా నటిస్తూ తహసీల్దార్‌ను బెదిరించి రూ. 50 లక్షలు వసూలు చేసిన నిందితుడు హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా కలగల్లు గ్రామానికి చెందిన ఇతడు 2021లో ముదిగుబ్బ తహసీల్దార్‌ను ఫోన్ ద్వారా బెదిరించి భారీగా నగదు వసూలు చేశాడు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో ముదిగుబ్బ సీఐ శివరాముడు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడిని పట్టుకున్నారు.

April 4, 2026 / 07:20 PM IST